శాఖవీధి ప్రభుత్వ గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
ముఖ్యమైన పాయింట్స్:గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్‌కు ఘన నివాళి.. పుస్తక ప్రదర్శన ప్రారంభం
అనకాపల్లి, నవంబర్ 15 (ప్రజా ముద్ర):
అనకాపల్లి పట్టణంలోని శాఖవీధి ప్రభుత్వ గ్రేడ్-1 శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ అధికారి కె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్లా నాగభూషణం పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఈ ప్రభుత్వ గ్రేడ్-1 గ్రంథాలయంలో సుమారు 12 వేల పుస్తకాలు అందుబాటులో ఉండటం విశేషమన్నారు.
పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర, విజ్ఞానశాస్త్రం, మహనీయుల జీవిత చరిత్రలు, దేశ నాయకుల గురించి తెలిపే పుస్తకాలతో పాటు బాలసాహిత్యం, సాంఘిక శాస్త్రాలు, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ గ్రంథాలయాలను సందర్శించాలని, పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని, మేధాశక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఎందరో మహనీయులు గ్రంథాలయాల ద్వారా విజ్ఞానాన్ని సంపాదించి సమాజానికి, దేశానికి సేవలందించారని గుర్తుచేశారు. పెద్దలు, విద్యార్థులు, చిన్నారులు గ్రంథాలయాలను సందర్శించి వాటి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
గ్రంథాలయ అధికారి కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి కృషిచేసిన ప్రముఖుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి ఆశయాలను భావితరాలకు తెలియజేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్లా నాగభూషణం, గ్రంథాలయ అధికారి కె. శ్రీనివాసరావు, న్యాయవాది బంధం దుర్గాప్రసాద్, విశ్రాంత గ్రంథాలయ అధికారి కొణతాల రామారావు, గ్రామ సచివాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.