బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ముప్పు.. ఏపీకి భారీ వర్ష సూచన!
ముఖ్యమైన పాయింట్స్:ఉత్తరాంధ్రకు గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలుసాయంత్రానికి తుపానుగా.. రేపు తీవ్ర తుపానుగా బలపడే అవకాశంప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
అమరావతి, నవంబర్ 16 (ప్రజాముద్ర):
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం అండమాన్ దీవులకు 640 కిలోమీటర్లు, చెన్నైకు 760 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 870 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 980 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తుపానుగా బలపడే అవకాశం
దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో సోమవారం సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత 48 గంటల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
ఈ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోమవారం సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి
తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, ముఖ్యంగా తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు వ్యవసాయ పనులు, పంటల రక్షణ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధికార యంత్రాంగం సూచనలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.