మొబైల్ టెక్నీషియన్లకు భరోసా.. డిజిటల్ సేవలకు ‘ఎంఎస్ఎం’ యాప్
ముఖ్యమైన పాయింట్స్:మొబైల్ రిపేరింగ్ రంగంలో పారదర్శకత, భద్రతే లక్ష్యం
రాజమహేంద్రవరం, ప్రజాముద్ర: మొబైల్ రిపేరింగ్ రంగంలో పనిచేస్తున్న టెక్నీషియన్ల భద్రతను బలోపేతం చేయడంతో పాటు, కస్టమర్లకు మరింత నమ్మకమైన సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ కొత్తగా ఎంఎస్ఎం డిజిటల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ వ్యాపార కార్యకలాపాలను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్ వెల్లడించారు.
రాజమహేంద్రవరంలోని మెగా కన్వెన్షన్ హాల్‌లో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. యాప్‌కు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి, దాని పనితీరు, వినియోగం, ప్రయోజనాలను వివరించారు.
ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ మొబైల్ రిపేరింగ్ వృత్తిలో టెక్నీషియన్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు, వారి వృత్తిపరమైన భద్రతకు ఈ యాప్ దోహదపడుతుందని తెలిపారు. మొబైల్ రిపేరింగ్ వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని ఒకే డిజిటల్ వేదికపై నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. దీనివల్ల వ్యాపార నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతాయని పేర్కొన్నారు.
కస్టమర్లు రిపేరింగ్ కోసం అందజేసే మొబైల్ ఫోన్ల వివరాలను యాప్‌లో నమోదు చేయడం ద్వారా సేవల నిర్వహణ మరింత క్రమబద్ధంగా ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. ముఖ్యంగా అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్న మొబైల్ ఫోన్ల గుర్తింపు, వాటి వినియోగాన్ని నిరోధించే దిశగా ఈ డిజిటల్ విధానం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ప్రాంత ఇన్‌చార్జి, వైస్ ప్రెసిడెంట్ కె. దామోదర్, కోస్తాంధ్ర ప్రాంత ఇన్‌చార్జి, జనరల్ సెక్రటరీ ఎన్. హేమసుందర్, రాజధాని ప్రాంత ఇన్‌చార్జి, వైస్ ప్రెసిడెంట్ ఎస్.కె. జానీ, రాయలసీమ ప్రాంత ఇన్‌చార్జి, వైస్ ప్రెసిడెంట్ ఎన్.ఎం. ప్రసాద్ పాల్గొన్నారు.
అసోసియేషన్ సభ్యత్వం కలిగిన ప్రతి మొబైల్ టెక్నీషియన్ ఎంఎస్ఎం యాప్‌ను వినియోగించుకోవాలని ప్రతినిధులు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మొబైల్ రిపేరింగ్ రంగంలో భద్రత, నమ్మకం, పారదర్శకతను మరింత పెంపొందించేందుకు అందరూ సహకరించాలని కోరారు.