నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడుతో దాడి రత్నాకర్ భేటీ
శ్రీకాకుళం:నిమ్మాడ, ప్రజాముద్ర: తెలుగుదేశం పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్చార్జి దాడి రత్నాకర్ శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలిశారు.ఈ సందర్భంగా రానున్న ఎంపీపీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో సభ్యుల ఎంపిక, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.