🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 10:40 pm Posted by : PRAJAMUDRA

అనకాపల్లిలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్

News Image
అనకాపల్లి, నవంబర్ 18 (ప్రజాముద్ర):
క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసి బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అనకాపల్లిలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, జార్జ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్స్ సత్య విష్ణూస్ ట్రోఫీ పేరుతో ఈ పోటీలు జరగనున్నాయి.
ఈ నెల 21వ తేదీ శనివారం నుంచి 22వ తేదీ ఆదివారం వరకు రెండు రోజుల పాటు అనకాపల్లిలోని జార్జ్ క్లబ్ ఇండోర్ కోర్టులో పోటీలు నిర్వహించనున్నారు.
విజేతలకు నగదు బహుమతులు
టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేయనున్నారు. మొదటి బహుమతిగా రూ.12,000, రెండో బహుమతిగా రూ.8,000, మూడో బహుమతిగా రూ.6,000 అందించనున్నారు.

నమోదుకు చివరి తేదీ 19
పోటీల్లో పాల్గొనాలనుకునే క్రీడాకారులు రూ.300 ఎంట్రీ ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఎంట్రీల స్వీకరణకు నవంబర్ 19వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించారు. నవంబర్ 20వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు డ్రా నిర్వహించనున్నారు. పోటీలకు సంబంధించిన ఎంట్రీలు, నిర్వహణ విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయమని ప్రకటనలో పేర్కొన్నారు.

వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు
కాండ్రేగుల జగదీష్ – 94408 30571
దాడి ఈశ్వరరావు – 92478 50003
బుద్ధ శివ – 99634 64646
జోషి – 63097 78861
బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.

🏠 Home