అక్వాన్ తుపానుతో ఉత్తరాంధ్రకు ముప్పు
ముఖ్యమైన పాయింట్స్:శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశంగంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
ప్రజాముద్ర, విశాఖపట్నం, నవంబర్ 18:
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తీవ్ర తుపాను ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. దక్షిణమధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుపాను గత ఆరు గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ప్రస్తుతం తుపాను నరసాపురానికి 500 కిలోమీటర్లు, కళింగపట్నానికి 540 కిలోమీటర్లు, చెన్నైకి 560 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 630 కిలోమీటర్లు, పూరీకి 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నానికి నరసాపురం నుంచి పూరీ మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రలో వర్ష సూచన
తుపాను ప్రభావంతో గురువారం (నవంబర్ 19) ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు.
ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
సహాయక బృందాలు సిద్ధం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస ప్రాంతాల్లో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, సీతంపేటలో మరో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, విజయనగరంలో ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని అందుబాటులో ఉంచినట్లు వివరించారు. స్థానిక అగ్నిమాపక బృందాలను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
తుపాను ప్రభావం దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.