నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.54.08 లక్షలు

77 రోజుల కానుకల లెక్కింపులో 20.05 గ్రాముల బంగారం, 1.060 కిలోల వెండి లభ్యం
అమ్మవారిపై భక్తుల అచంచల విశ్వాసానికి హుండీ కానుకలే నిదర్శనం – ఈఓ, చైర్మన్
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, భక్తుల ఆరాధ్య దైవంగా కొలువుదీరిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.54,08,952 ఆదాయం సమకూరింది. 77 రోజుల వ్యవధిలో భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం లభించింది.
శుక్రవారం దేవస్థాన అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, సంబంధిత పర్యవేక్షకుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించారు. ఈ లెక్కింపులో నగదుతో పాటు 20 గ్రాముల 50 మిల్లీగ్రాముల బంగారం, ఒక కిలో 60 గ్రాముల వెండి లభించాయి. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీని కూడా భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించారు.
ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి బుద్ద మహాలక్ష్మి నగేష్, చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు) మాట్లాడుతూ.. అమ్మవారిపై భక్తులు చూపిస్తున్న అచంచలమైన భక్తి, విశ్వాసాలకు హుండీ కానుకలు నిదర్శనమని తెలిపారు. భక్తులు సమర్పించే ప్రతి కానుక దేవస్థానానికి ఎంతో విలువైనదని, వాటిని ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు సద్వినియోగం చేస్తామని పేర్కొన్నారు.
అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు దేవస్థాన అభివృద్ధికి అవసరమైన చర్యలను నిరంతరం చేపడుతున్నామని వెల్లడించారు. అమ్మవారిపై భక్తులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు, విశ్వాసానికి దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు భక్తులందరిపై సదా ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు: అనకాపల్లి జిల్లా దేవదాయ శాఖ అధికారి వై.వి. రమణి, దేవాదాయ శాఖ తనిఖీదారు బి. వసంతకుమార్, దేవస్థాన చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు, యర్రవరపు సంతోషి కుమారి నాగేష్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.