Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ సందేశాలు: అప్రమత్తంగా ఉండాలన్న యంత్రాంగం

Author
Posted By PRAJAMUDRA
| 24 Oct 2026, 02:25 PM | Crime, ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ సందేశాలు: అప్రమత్తంగా ఉండాలన్న యంత్రాంగం

​అనకాపల్లి:
అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వాట్సాప్ సందేశాలతో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.
​గత రెండు రోజులుగా కలెక్టర్ పేరు, నకిలీ ఫోన్ నంబర్లను ఉపయోగించి వాట్సాప్‌లో పలు తప్పుడు సందేశాలు, సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను పరిశీలించకుండా నమ్మవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని స్పష్టం చేశారు. నకిలీ సందేశాలు సృష్టించే వారిపై, వాటిని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: