Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

అనకాపల్లిలో మెగా యోగా కార్యక్రమం

Author
Posted By PRAJAMUDRA
| 26 Nov 2026, 10:27 AM | ఆంధ్రప్రదేశ్
అనకాపల్లిలో మెగా యోగా కార్యక్రమం

  • నవంబర్ 29న ఎన్‌టీఆర్ స్టేడియంలో నిర్వహణ

అనకాపల్లి: ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆనందాన్ని అందించడమే లక్ష్యంగా అనకాపల్లి పట్టణంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో ఈ నెల 29వ తేదీ ఆదివారం మెగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పూజ్య స్వామీజీ సన్నిధిలో జరిగే ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగనుంది.

ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉచితంగా పాల్గొనే అవకాశం కల్పించారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఆనందమయ జీవనాన్ని పొందవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కుటుంబ సభ్యులు, స్నేహితులు, యువత, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

రండి.. యోగం చేద్దాం.. ఆరోగ్యాన్ని సొంతం చేసుకుందాం!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: