Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా

Author
Posted By PRAJAMUDRA
| 22 Oct 2026, 08:30 PM | Politics, ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా

  • నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్లతో పహారా
  • 100 మీటర్ల పరిధిలోకి నలుగురికే ప్రవేశం
  • బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

అనకాపల్లి, అక్టోబర్ 22 (ప్రజాముద్ర ప్రతినిధి):
జిల్లాలో జరుగుతున్న ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ హెచ్చరించారు. నామినేషన్ల ప్రక్రియ రెండో రోజుకు చేరిన నేపథ్యంలో బుధవారం ఆయన బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట మండల పరిషత్ కార్యాలయాలు (MPDO), జిల్లా పరిషత్ కార్యాలయ పరిసరాల్లోని నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం చుట్టూ ఉన్న 100 మీటర్ల పరిధిని అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణించాలని, అక్కడ ప్రజలు గుమిగూడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేర్వేరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తకుండా 100 మీటర్ల అవతలే నియంత్రించాలని సూచించారు.
అభ్యర్థితో పాటు నలుగురికే అనుమతి
నామినేషన్ దాఖలు చేసే సమయంలో కేంద్రం లోపలికి అభ్యర్థితో పాటు గరిష్టంగా నలుగురు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ తెలిపారు. నామినేషన్ పూర్తయిన వెంటనే అభ్యర్థులు, వారి అనుచరులు అక్కడే ఉండకుండా వెంటనే వెనుదిరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. వివిధ రాజకీయ పార్టీలు ఒకే సమయంలో కాకుండా వేర్వేరు వేళల్లో ర్యాలీలు నిర్వహించుకునేలా సమన్వయం చేసుకోవాలని కోరారు.
డ్రోన్ నిఘా... అమల్లో సెక్షన్ 163 BNSS
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. (గతంలో 144 సెక్షన్) అమల్లో ఉన్నాయని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎన్నికల సజావుగా సాగేందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పర్యటనలో కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, ఎస్సైలు మనోజ్ కుమార్, శ్రీనివాస్, రామకృష్ణారావు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా - Additional Imageఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా - Additional Imageఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా - Additional Imageఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: