Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

పెద్దేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత.. లోతట్టు ప్రాంతాలకు తీవ్ర హెచ్చరికలు!

Author
Posted By PRAJAMUDRA
| 28 Oct 2026, 11:30 AM | ఆంధ్రప్రదేశ్
పెద్దేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత.. లోతట్టు ప్రాంతాలకు తీవ్ర హెచ్చరికలు!

  • ఆర్నాబ్’ తుపానుతో పోటెత్తుతున్న వరద నీరు.. దిగువకు భారీగా విడుదల
  • ​6 మండలాల పరిధిలోని గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ విజయకృష్ణన్

అనకాపల్లి:బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఆర్నాబ్’ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్దేరు రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఒక అత్యవసర ప్రకటనలో హెచ్చరించారు. వరద ఉధృతి నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
​ముంపు ముప్పు పొంచి ఉన్న మండలాలు – గ్రామాలు:
​మాడుగుల మండలం: పోతనపూడి, వీ.వీ. అగ్రహారం
​అనకాపల్లి మండలం: తగరంపూడి, వెంకుపాలెం, సీతానగరం, తుంపాల, సత్యనారాయణపురం, కొత్తూరు
​బుచ్చయ్యపేట మండలం: వడ్డాది, విజయరామరాజుపేట పరిసర ప్రాంతాలు
​చోడవరం మండలం: గౌరీపట్నం, జన్నవరం, బెన్నవోలు, పి.ఎస్. పేట
​కశింకోట మండలం: కశింకోట, తేగాడ, పెరంటాలపాలెం, జోగారావుపేట
​రాంబిల్లి మండలం: కొత్తూరు, రజాల గ్రామాలు
​ప్రజలకు జిల్లా యంత్రాంగం ముఖ్య సూచనలు:
​నదులు, వాగుల వైపు వెళ్లొద్దు: కాలువలు, కాజ్‌వేలు, నదీ తీరాల వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దు. వరద ఉధృతిని చూసేందుకు వంతెనలపై గుమిగూడటం నిషేధం.
​పశువుల రక్షణ బాధ్యత: పశువులు, గొర్రెలు, మేకలను నదీ ప్రవాహ ప్రాంతాలకు మేత కోసం తోలకూడదు. వాటిని ముందుగానే ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
​అధికారుల ఆదేశాలు పాటించండి: లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి.
​అత్యవసర సమాచారం: పుకార్లను నమ్మవద్దు. అత్యవసర సహాయం కోసం గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిని లేదా సమీప పోలీస్ స్టేషన్, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: