Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

అర్ణబ్ తుపాను బీభత్సం: జాతీయ రహదారిపై విరిగిపడిన భారీ వృక్షాలు!

Author
Posted By PRAJAMUDRA
| 28 Oct 2026, 11:55 AM | ఆంధ్రప్రదేశ్
అర్ణబ్ తుపాను బీభత్సం: జాతీయ రహదారిపై విరిగిపడిన భారీ వృక్షాలు!

  • ​స్తంభించిన రాకపోకలు.. వర్షంలోనూ రంగంలోకి దిగిన పోలీసులు, అధికార యంత్రాంగం
  • ​యుద్ధప్రాతిపదికన చెట్ల తొలగింపు.. ట్రాఫిక్ పునరుద్ధరణ

అనకాపల్లి క్రైమ్ బ్యూరో:
అర్ణబ్ తుపాను ప్రభావంతో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తీవ్ర గాలుల ధాటికి మంగళవారం రాత్రి అనకాపల్లి పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం, పోలీసు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలాలకు చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
​డైట్ కాలేజీ వద్ద 20 నిమిషాల్లోనే క్లియరెన్స్
​అనకాపల్లి నేషనల్ హైవేపై డైట్ (DIET) ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో భారీ వృక్షం కూలిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే జోనల్ కమిషనర్ శ్రీ చక్రవర్తి, ఎంఆర్వో శ్రీ ఆనందరావు, అనకాపల్లి ట్రాఫిక్ సీఐ శ్రీ నాగేశ్వరరావు, టౌన్ సీఐ శ్రీ ప్రేమ్ కుమార్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివిధ శాఖల సమన్వయంతో అధికారులు రంగంలోకి దిగి కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే రోడ్డుకు అడ్డంగా పడిన భారీ చెట్టును తొలగించారు. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.
​కొప్పాక, ఆర్టీవో ఆఫీస్ వద్ద రాత్రి వేళ సహాయక చర్యలు
​మరోవైపు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొప్పాక, ఆర్టీవో ఆఫీస్ సమీపంలో జాతీయ రహదారిపై మరో రెండు పెద్ద చెట్లు కూలిపోయాయి. చీకటి, ఎడతెరిపిలేని భారీ వర్షం, భీకర గాలులను సైతం లెక్కచేయకుండా అనకాపల్లి రూరల్ సీఐ శ్రీ జి. అశోక్ కుమార్, ఎస్ఐ శ్రీ జి. రవి కుమార్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జీవీఎంసీ (GVMC) సిబ్బంది సహకారంతో హైవేపై పడిన చెట్ల కొమ్మలను నరికివేసి రహదారిని క్లియర్ చేశారు.
​తీవ్ర ప్రతికూల వాతావరణంలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టిన పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పనితీరుపై స్థానిక ప్రజలు, వాహనదారులు ప్రశంసలు కురిపించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: