Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి

Author
Posted By PRAJAMUDRA
| 29 Oct 2026, 10:57 PM | ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి

  • కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి: ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్
  • జీవీఎంసీ 110, 111 వార్డుల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం

అనకాపల్లి (ప్రజాముద్ర):
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి అనకాపల్లి అభివృద్ధికి బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ పిలుపునిచ్చారు. అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అర్బన్ డెవలప్‌మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, కూటమి రథసారథి భీమరశెట్టి రామ్కి ఆదేశాల మేరకు అనకాపల్లి పట్టణంలోని 110, 111 వార్డుల్లో బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
​110వ వార్డులో అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం:
110వ వార్డు పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల పెద్ద రెల్లి వీధిలో నిర్వహించిన ప్రచారంలో సబ్బవరపు గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక చొరవతో 110, 112 డివిజన్లలో దాదాపు ₹1.60 కోట్ల నిధులతో శ్రీరామ్ నగర్, ఏఎంసీ కాలనీ, పెదరెల్లి వీధుల్లో సామాజిక భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న కూటమికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు.
​ఈ ఎన్నికల్లో కూటమి జనసేన కార్పొరేటర్ అభ్యర్థి తాడి శాంత కుమారిని 'గాజు గ్లాస్' గుర్తుపై, కూటమి టీడీపీ మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్క శ్రావణిని 'సైకిల్' గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
​111వ వార్డులో ఇంటింటి ప్రచారం:
అనంతరం 111వ వార్డు పరిధిలోని భీముని గుమ్మం వీధి (185, 186 పోలింగ్ కేంద్రాల పరిధి) లో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పలక యశోదకు 'కమలం' గుర్తుపై, మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్క శ్రావణికి 'సైకిల్' గుర్తుపై ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు.
​ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కాయల ప్రసన్నలక్ష్మి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త ఎల్లబెల్లి ధనలక్ష్మి, స్థానిక మహిళలు, కూటమి శ్రేణులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: