Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజలకు రక్షణ కల్పించండి

Author
Posted By PRAJAMUDRA
| 30 Oct 2026, 02:56 PM | ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజలకు రక్షణ కల్పించండి

  • అనకాపల్లిలో ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజలకు రక్షణ కల్పించండి
  • • రోడ్లమీదకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు
  • • జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిద్ధార్థ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
  • .

అనకాపల్లి (ప్రజాముద్ర ప్రతినిధి):
అనకాపల్లి జీవీఎంసీలో విలీనమై, నూతన జిల్లాగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న జిల్లా, పట్టణ ప్రజలకు తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక జీవీఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సిద్ధార్థ సోషల్ సర్వీస్ & కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు, సీనియర్ సిటిజన్లు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం మాట్లాడుతూ, రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి తగ్గట్లుగా సరైన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ లేకపోవడం శోచనీయమన్నారు. రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారని, రోజూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం తీవ్ర విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల పర్యవేక్షణ లోపం:
పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురై వ్యాపారాలు సాగుతున్నాయని, భవనాల సెల్లార్లలో సైతం వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో వాహనాల పార్కింగ్‌కు స్థలం లేకుండా పోయిందన్నారు. అలాగే తోపుడు బండ్లు, చిరు దుకాణాల వారికి ప్రత్యేక స్థలాలు కేటాయించకుండా రోడ్లపైనే వ్యాపారాలు చేసుకునేలా వదిలేయడం, ఆర్‌టీవో అధికారుల నిర్లిప్తత, పట్టణంలో వన్‌వే వ్యవస్థను అమలు చేయకపోవడం వల్లే ట్రాఫిక్ సమస్య జటిలమైందని పేర్కొన్నారు.
గత పదేళ్లుగా ఈ సమస్యల పరిష్కారానికై సిద్ధార్థ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, పోలీస్ యంత్రాంగం, జీవీఎంసీ, ఆర్‌టీవో అధికారులు తక్షణమే స్పందించి పటిష్టమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిద్ధార్థ అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సభ్యులు అయ్యగారు వెంకటరమణమూర్తి, పొట్టి శ్రీరాములు భవన్ సంస్థ చైర్మన్ పిరాట్ల నరసింహమూర్తి, సీనియర్ సిటిజన్ సంస్థ సభ్యులు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: