Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

జీవీఎంసీ 111వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం

Author
Posted By PRAJAMUDRA
| 30 Oct 2026, 04:09 PM | ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీ 111వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం

  • జీవీఎంసీ 111వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం
  • ఓటు వేసే విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించిన సబ్బవరపు గణేష్

అనకాపల్లి:(ప్రజాముద్ర)జీవీఎంసీ 111వ వార్డు పరిధిలోని భీముని గుమ్మం వీధిలో కూటమి నాయకులు విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ స్వయంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేపట్టారు.
​రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌పై ఓటు ఏ విధంగా వేయాలో వృద్ధులకు, కొత్తగా ఓటు హక్కు పొందిన యువతీ యువకులకు నమూనా పత్రాల ద్వారా ఆయన వివరించారు. కూటమి బలపరిచిన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పలక యశోదకు ‘కమలం’ గుర్తుపై, కూటమి టీడీపీ మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణికి ‘సైకిల్’ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన స్థానికులను కోరారు. వార్డు అభివృద్ధి కూటమి అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
​ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు మాజీ అధ్యక్షుడు పోతల శ్రీను, బూత్ ఇంచార్జ్ సిమిటి రామకృష్ణ, నాయకులు దౌర్ల కిషోర్ కుమార్, శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం ధర్మకర్త ఎల్లబెల్లి కనకతో పాటు పలువురు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: