Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

Author
Posted By PRAJAMUDRA
| 30 Oct 2026, 06:17 PM | ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

  • కసింకోట మండలంలో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం
  • ​తేగడ, కొత్తపల్లి, విస్సన్నపేట గ్రామాల్లో అభ్యర్థుల తరఫున పొన్నగంటి అప్పారావు విస్తృత పర్యటన
  • ​దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు అందిస్తున్నాం: అప్పారావు

కసింకోట:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ సమగ్ర ప్రగతికి బాటలు వేస్తోందని కూటమి ముఖ్య నాయకులు పొన్నగంటి అప్పారావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణల ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాల్లో కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.
​బుధవారం తేగడ, కొత్తపల్లి, జమాదులపాలెం, విస్సన్నపేట, రామన్నపాలెం గ్రామాల్లో అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు కూటమి శ్రేణులకు ఘన స్వాగతం పలికారు.
​ఈ సందర్భంగా పొన్నగంటి అప్పారావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులు నేడు ప్రజల కళ్ల ముందే సాక్షాత్కరిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో అర్హులైన పేదలకు రికార్డు స్థాయిలో పింఛన్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంయుక్త సారథ్యంలో పల్లెల్లో మునుపెన్నడూ లేని విధంగా నిధులు వెచ్చించి మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర వికాసం కూటమి అభ్యర్థుల విజయంతోనే సాధ్యమని, ఓటర్లంతా భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని కోరారు.
​తరలివచ్చిన నాయకులు, శ్రేణులు:
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిని రమణమూర్తి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కాయల మురళీధర్, జనసేన పార్టీ నాయకులు కర్రి సత్యనారాయణ, ఉమ్మి సత్యనారాయణ, ఎంపీటీసీ అభ్యర్థులు గొర్ల దత్తాత్రేయ, కట్టోజు సాయిలక్ష్మి పాల్గొన్నారు. అలాగే మాజీ సర్పంచులు సిద్దిరెడ్డి సూర్యనారాయణ, బుధిరెడ్డి గంగయ్య, తిర్రి చిరంజీవి, బద్ది గోవింద, మండల ఐ-టీడీపీ అధ్యక్షులు జెర్రీపోతుల నూకునాయుడు, మాజీ ఎంపీటీసీ షేక్ బాబర్, స్థానిక నాయకులు గొల్లవిల్లి ప్రవీణ్, సిదిరెడ్డి శ్రీను, మండే శ్రీను, బత్తిన రమణ, పప్పు ఈశ్వరరావుతో పాటు భారీ సంఖ్యలో కూటమి కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: