Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

పిల్లల పెంపకంలో ప్రేమ ఉండాలి.. గారాబం కాదు!

Author
Posted By PRAJAMUDRA
| 01 Nov 2026, 10:57 PM |
పిల్లల పెంపకంలో ప్రేమ ఉండాలి.. గారాబం కాదు!

రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానవీయ దాడి వంటి ఘటనలు సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలకు వ్యక్తిగత బాధ్యతతో పాటు సమాజంలో తగ్గిపోతున్న మానవతా విలువలు కూడా ఒక కారణమని భావించాల్సి ఉంది.
పిల్లల్లో మంచి విలువలు, క్రమశిక్షణ, ఇతరుల పట్ల గౌరవం పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. పిల్లలపై ప్రేమ చూపించడం ఎంత ముఖ్యమో, అతిగా గారాబం చేయకుండా తప్పొప్పులను వివరించడం కూడా అంతే ముఖ్యం.
పిల్లల్లో వస్తున్న శారీరక, మానసిక మార్పులను తల్లిదండ్రులు గమనించాలి. వారి భావాలను అర్థం చేసుకుని, అవసరమైనప్పుడు సరైన మార్గదర్శకత్వం అందించాలి. గెలుపుతో పాటు ఓటమిని స్వీకరించే మనస్తత్వాన్ని నేర్పాలి. ఇతర పిల్లలతో పోల్చకుండా ప్రతి ఒక్కరిలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి.
అలాగే పిల్లల స్నేహాలు, అలవాట్లు, ప్రవర్తనను గమనిస్తూ మంచి స్నేహాలు, పుస్తక పఠనం, క్రీడలు, నీతి కథల పట్ల ఆసక్తి పెంచాలి. పిల్లలు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటూ, వారి సమస్యలకు ఓపికగా పరిష్కారాలు చూపాలి.
నేటి చిన్న కుటుంబ వ్యవస్థలో పెద్దల పాత్ర తగ్గుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులే పిల్లలకు మార్గదర్శకులుగా నిలవాలి. తాము ఆచరించే విలువలనే పిల్లలకు నేర్పాలి. ప్రకృతి, పశుపక్షాదులు, తోటి మనుషుల పట్ల ప్రేమ, దయ, కరుణ, విచక్షణ కలిగేలా పెంచాలి.
పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వడం కంటే మంచి వ్యక్తిత్వాన్ని అందించడం గొప్ప బహుమతి. చదువులోనే కాకుండా మానవత్వంలోనూ పిల్లలు ఎదిగినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణమవుతుంది. భావితరాలకు మంచి సమాజాన్ని అందించాలంటే ప్రతి తల్లిదండ్రులిద్దరూ తమ బాధ్యతను గుర్తించాలి

— శేషెట్టి గిరీష్ కుమార్
( M.B.A, M.Sc Psy., M.A Pub.Admn. ) కరస్పాండెంట్, హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్ , వుడ్ పేట, అనకాపల్లి., 9032493934, 7799773763

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: