Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలి ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్‌సీపీ తరఫున ఆర్థిక సాయం బెంగళూరులో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించిన వైఎస్ జగన్

Author
Posted By PRAJAMUDRA
| 02 Nov 2026, 07:06 PM | జాతీయం
విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలి  ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్‌సీపీ తరఫున ఆర్థిక సాయం  బెంగళూరులో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించిన వైఎస్ జగన్

  • విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలి
  • ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్‌సీపీ తరఫున ఆర్థిక సాయం
  • బెంగళూరులో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించిన వైఎస్ జగన్

బెంగళూరు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో దాడికి గురై బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని గోపికను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆసుపత్రిలో వైద్యులను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పాఠశాలలోకి ఎలక్ట్రికల్ రంపంతో ఓ వ్యక్తి ప్రవేశించి విద్యార్థినులపై దాడికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లోనే భద్రత లేకపోతే వారి భవిష్యత్తుకు ఎవరు భరోసా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో గంజాయి, మద్యం, బెల్ట్ షాపుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపించారు. మత్తు పదార్థాల ప్రభావం యువతపై పడుతోందని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

రూ.50 లక్షల పరిహారం డిమాండ్

గోపిక కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల ఆర్థిక పరిహారం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. బాధితురాలికి అత్యుత్తమ వైద్యం అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం పరిహారం అందించకపోతే వైఎస్సార్‌సీపీ తరఫున వైద్య ఖర్చులను భరిస్తామని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

రాప్తాడులో శాంతిభద్రతలపై విమర్శలు

రాప్తాడు నియోజకవర్గంలో గత 15–16 నెలల కాలంలో మహిళలపై దాడులు, హత్యలు సహా తొమ్మిది తీవ్రమైన ఘటనలు చోటుచేసుకున్నాయని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని విమర్శించారు. పోలీసు యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పనిచేస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

గోపిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా

దాడిలో తీవ్రంగా గాయపడిన గోపికకు బెంగళూరులోని ఆసుపత్రిలో సుమారు 11 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించినట్లు జగన్ తెలిపారు. ఆపరేషన్‌ను బాలిక తట్టుకుందని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులు వెల్లడించినట్లు చెప్పారు. మరో 48 గంటలు కీలకమని వైద్యులు తెలిపినట్లు వివరించారు.

గోపిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన జగన్, బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: