Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

గర్భిణులకు జన చైతన్య సమితి సేవలు అభినందనీయం

Author
Posted By PRAJAMUDRA
| 10 Nov 2026, 04:04 PM | ఆంధ్రప్రదేశ్
గర్భిణులకు జన చైతన్య సమితి సేవలు అభినందనీయం

  • మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణకు పోషకాహార పంపిణీ ఎంతో ఉపయోగకరం: డాక్టర్ జి. సరస్వతి

అమరావతి, నవంబర్ 9: గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు జన చైతన్య సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అమరావతి సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ జి. సరస్వతి పేర్కొన్నారు. గర్భిణులు మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటూ, ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

జన చైతన్య సమితి ఆధ్వర్యంలో పెదకూరపాడుకు చెందిన నెలకుదుటి వెంకట రామారావు (నాని) జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన సహకారంతో సోమవారం అమరావతి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణులకు పోషకాహారాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ సరస్వతి మాట్లాడుతూ.. ప్రతి నెల 9వ తేదీన క్రమం తప్పకుండా గర్భిణులకు, వారికి సహాయంగా వచ్చిన కుటుంబ సభ్యులకు పోషకాహారం అందించడం మంచి కార్యక్రమమని కొనియాడారు. గర్భిణులకు సమతుల్యమైన ఆహారం అందించడం ద్వారా తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే శిశువు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచవచ్చని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జన చైతన్య సమితి ప్రతినిధులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

ఇవి కూడా చదవండి

జన చైతన్య సమితి కార్యదర్శి తుళ్లూరి సాంబశివరావు మాట్లాడుతూ.. సేవాభావంతో గర్భిణులకు పోషకాహారం అందించేందుకు ముందుకొచ్చిన నెలకుదుటి వెంకట రామారావు (నాని)కి అభినందనలు తెలిపారు. దాతల సహకారమే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ప్రధాన బలమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి విజయ్ బెన్నిబాబు, కోఆర్డినేటర్ వెలితోటి అనిల్ కుమార్, ప్రతినిధులు షేక్ లియాకత్ అలీ, షేక్ సుభాని, స్టాఫ్ నర్స్ పూదోట లిల్లీ రోజ్ రాణి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గర్భిణులకు భోజనంతో పాటు డ్రైఫ్రూట్స్ లడ్డూలు, శనగల లడ్డూలు, కోడిగుడ్లు, సీతాఫలాలు, దానిమ్మ, బత్తాయి, అరటిపండ్లను పంపిణీ చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: