Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

ఎన్నికల తర్వాతా ప్రజలతోనే ఉంటా.. 109వ వార్డులో కోరిబిల్లి పరి ఆత్మీయ కలయిక

Author
Posted By PRAJAMUDRA
| 10 Nov 2026, 10:24 PM | ఆంధ్రప్రదేశ్
ఎన్నికల తర్వాతా ప్రజలతోనే ఉంటా.. 109వ వార్డులో కోరిబిల్లి పరి ఆత్మీయ కలయిక

  • ఎన్నికల్లో సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు.. వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ

అనకాపల్లి: ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటికీ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయంగా గడిపేందుకు 109వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిబిల్లి పరి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువత, అభిమానులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోరిబిల్లి పరి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు అందించిన సహకారం, చూపిన ఆదరణను ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు.

ఎన్నికలు ముగిసినంత మాత్రాన ప్రజలతో తనకున్న సంబంధాలు ముగిసిపోవని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా వార్డు ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం తన ప్రాధాన్యతలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సుఖదుఃఖాల్లో భాగస్వామిగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరితో భవిష్యత్తులోనూ ఇదే అనుబంధాన్ని కొనసాగిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అనకాపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మలపరెడ్డి కోటేశ్వరరావు, బుద్ధ మహేష్, కాళ్ల వెంకట సత్యనారాయణ, సత్యనారాయణ, తుట్టా రమణ, కొండబాబు, బుద్ధ కిషోర్, మున్నా, నవీన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజల మధ్య ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: