Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

డైట్ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు.. మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళి

Author
Posted By PRAJAMUDRA
| 11 Nov 2026, 11:48 AM | ఆంధ్రప్రదేశ్
డైట్ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు.. మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళి

అనకాపల్లి, నవంబర్ 11 (ప్రజా ముద్ర):

జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లిలోని దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (డైట్) కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం దేశ విద్యారంగ అభివృద్ధికి ఆజాద్ చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

స్వాతంత్ర్యానంతరం భారతదేశ విద్యావ్యవస్థ పటిష్టతకు పునాదులు వేసిన ప్రముఖుల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒకరని ఆయన పేర్కొన్నారు. విద్య అనేది సమాజ పురోగతికి, దేశాభివృద్ధికి ప్రధాన సాధనమని చాటిచెప్పిన మహనీయుడిగా ఆజాద్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

విద్యార్థులు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. వైకుంఠరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులర్పించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: