Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

ధరల భారంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు: మాజీ మంత్రి ధర్మాన

Author
Posted By PRAJAMUDRA
| 15 Nov 2026, 11:16 PM | ఆంధ్రప్రదేశ్
ధరల భారంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు: మాజీ మంత్రి ధర్మాన

శ్రీకాకుళం: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు.
​2050 నాటికి రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామని, రూపాయికే భూములు ఇస్తూ పరిశ్రమలు తెస్తామని సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ధర్మాన ఆరోపించారు. నేడు రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు తమ సంపాదనతో కుటుంబ సభ్యుల కడుపు నింపలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
​ధరల పెరుగుదల (2024 vs ప్రస్తుతం):
​బియ్యం (సూపర్ ఫైన్): రూ. 50 నుండి రూ. 85కి; సాధారణ బియ్యం: రూ. 45 నుండి రూ. 75కి పెరిగాయి.
​పప్పులు: కందిపప్పు (రూ. 180), మినప్పప్పు (రూ. 160), పెసరపప్పు (రూ. 180) ధరలకు చేరాయి.
​ఇతర నిత్యావసరాలు: ఉల్లిపాయలు రూ. 20 నుండి రూ. 90కి, పామాయిల్ రూ. 90 నుండి రూ. 155కి, గ్యాస్ సిలిండర్ రూ. 855 నుండి రూ. 970కి, పెట్రోల్ రూ. 118కి పెరిగాయి.
​ఛార్జీలు & ఫీజులు: కరెంట్ ట్రూ-అప్ ఛార్జీల పేరుతో రూ. 20 వేల కోట్ల భారం వేశారని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ప్రైవేట్ స్కూల్/కాలేజీ ఫీజులు 40 శాతం పెరిగాయని తెలిపారు.
​ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసగించిన ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారానే తగిన బుద్ధి చెప్పాలని ధర్మాన ప్రజలకు పిలుపునిచ్చారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: