Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

పోలీసులను కారుతో ఢీకొట్టిన బీజేపీ అభ్యర్థిని తక్షణమే అరెస్టు చేయాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య

Author
Posted By PRAJAMUDRA
| 16 Nov 2026, 02:17 PM | ఆంధ్రప్రదేశ్
పోలీసులను కారుతో ఢీకొట్టిన బీజేపీ అభ్యర్థిని తక్షణమే అరెస్టు చేయాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య

  • ​ఎన్నికలలో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్
  • ​శ్రీకాకుళం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఐ

విజయవాడ, నవంబర్ 16:
నామినేషన్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీసులను కారుతో ఢీకొట్టిన శ్రీకాకుళం 36వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి చల్లా వెంకటేశ్వరరావును తక్షణమే అరెస్టు చేసి, ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
​శ్రీకాకుళం 36వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన బీజేపీ నేత చల్లా వెంకటేశ్వరరావు (శ్రీకాకుళం మేయర్ అభ్యర్థి చల్లా గ్రీష్మ తండ్రి) ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారని ఈశ్వరయ్య మండిపడ్డారు. నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేయాల్సి ఉన్నప్పటికీ, తాను కారుతోనే లోపలికి వెళ్తానంటూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో అడ్డుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ మెట్ట సుధాకర్‌లను కారుతో దారుణంగా ఢీకొట్టడం అత్యంత అమానుషమని, గర్హనీయమని ఆయన తీవ్రంగా ఖండించారు.
​రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఒకవైపు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అధికార కూటమి ప్రభుత్వం బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాలకు గురిచేస్తోందని ఈశ్వరయ్య ఆరోపించారు. మరోవైపు అధికార కూటమి పార్టీల అనుయాయులు రౌడీలు, గూండాలవలె వ్యవహరిస్తూ ఏకంగా పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు.
​పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన చల్లా వెంకటేశ్వరరావుపై తక్షణమే హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, అతని నామినేషన్‌ను తిరస్కరించి అనర్హుడిగా ప్రకటించాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని ఈశ్వరయ్య కోరారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: