Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

మత్స్యరంగంలో యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

Author
Posted By PRAJAMUDRA
| 21 Nov 2026, 04:28 PM | NATIONAL, ఆంధ్రప్రదేశ్
మత్స్యరంగంలో యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకల్లో జిల్లా మత్స్యశాఖ అధికారి వర్ధన్

ఐస్‌బాక్స్‌లతో కూడిన ద్విచక్ర వాహనాల పంపిణీ

అనకాపల్లి, నవంబర్ 21: ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి ఎల్.బి.ఎస్. వర్ధన్, సహాయ సంచాలకులు జి. విజయ, జిల్లా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు గురునాదరావు, SARDS స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మంగమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ ఏడాది ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ‘మార్పు కోసం ప్రజలకు సాధికారత – మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో ముఖ్యంగా యువత, మహిళలకు గౌరవప్రదమైన ఉపాధి అవకాశాల కల్పన’ అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి ఎల్.బి.ఎస్. వర్ధన్ మాట్లాడుతూ మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. మత్స్య సంపద పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, స్థిరమైన మత్స్యరంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సహాయ సంచాలకులు జి. విజయ మాట్లాడుతూ మత్స్య సంపదను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన చేపల వేట పద్ధతులను అనుసరిస్తూ, భవిష్యత్ తరాలకు మత్స్య సంపదను అందించేందుకు మత్స్యకారులు సహకరించాలని సూచించారు.

ఇద్దరు లబ్ధిదారులకు ఐస్‌బాక్స్‌లతో ద్విచక్ర వాహనాలు

కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పథకం కింద జనరల్ కేటగిరీకి చెందిన ఇద్దరు లబ్ధిదారులు పగి బాలరాజు, యర్రవారపు శివలకు ఐస్‌బాక్స్‌లతో కూడిన టీవీఎస్ ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. చేపల రవాణా, విక్రయాలకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడటంతో పాటు మత్స్యకారుల ఆదాయాభివృద్ధికి దోహదపడతాయని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని మత్స్యకార సంఘాల అధ్యక్షులు, మత్స్యకారులు, మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: