Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

తప్పుడు నంబర్ ప్లేట్లపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు

Author
Posted By PRAJAMUDRA
| 21 Nov 2026, 06:35 PM | Array
తప్పుడు నంబర్ ప్లేట్లపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై చర్యలు.. ఉల్లంఘనులకు జరిమానాలు

అనకాపల్లి, నవంబర్ 21: వాహనాలకు తప్పుడు, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకుని తిరిగే వారిపై అనకాపల్లి పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు నకిలీ నంబర్ ప్లేట్లను వినియోగించకుండా అడ్డుకోవడంతో పాటు, వాహనాల గుర్తింపునకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు.

అనకాపల్లి డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విరిగిపోయిన, స్పష్టంగా కనిపించని, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన నంబర్ ప్లేట్లను పరిశీలించారు.

రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా హిట్ అండ్ రన్ ఘటనల్లో సంబంధిత వాహనాలను త్వరగా గుర్తించేందుకు ప్రతి వాహనానికి స్పష్టంగా కనిపించే విధంగా నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్ ఉండటం తప్పనిసరని వాహనదారులకు అవగాహన కల్పించారు.

ఇవి కూడా చదవండి

నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించడంతో పాటు, వాహనాలకు సరైన నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఈ తనిఖీల్లో అనకాపల్లి టౌన్ సీఐ జి. ప్రేమ్ కుమార్, ట్రాఫిక్ సీఐ నాగేశ్వరరావు, టౌన్ ఎస్ఐ షేక్ జిలాని, ట్రాఫిక్ ఎస్ఐ అర్జున్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వాహనదారులందరూ మోటారు వాహన చట్ట నిబంధనల ప్రకారం స్పష్టంగా కనిపించే సరైన నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలని, పోలీసుల తనిఖీలకు సహకరించాలని పోలీసులు సూచించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: