Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

రుషికొండ బీచ్‌లో విషాదం.. సముద్రంలో గల్లంతైన బీకాం విద్యార్థి

Author
Posted By PRAJAMUDRA
| 22 Nov 2026, 12:36 PM | ఆంధ్రప్రదేశ్
రుషికొండ బీచ్‌లో విషాదం.. సముద్రంలో గల్లంతైన బీకాం విద్యార్థి

విశాఖపట్నం: విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన బుల్లయ్య కాలేజీకి చెందిన బీకాం విద్యార్థుల్లో ఒకరు గల్లంతయ్యారు. విద్యార్థి ఆచూకీ కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
శనివారం మధ్యాహ్నం బుల్లయ్య కాలేజీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు రుషికొండ బీచ్‌కు వెళ్లినట్లు సమాచారం. వారిలో నలుగురు సముద్రంలో స్నానానికి దిగగా ప్రమాదవశాత్తు ఒక విద్యార్థి సముద్రంలో గల్లంతైనట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అధికారులు శనివారం రాత్రి నుంచి గాలింపు చర్యలు ప్రారంభించారు. టూరిజం బోట్ల సహాయంతో రాత్రంతా అన్వేషణ కొనసాగించారు. ఆదివారం ఉదయం నుంచి షిప్‌ ద్వారా సముద్రంలో గాలింపు చేపట్టారు. విద్యార్థి ఆచూకీ కోసం రెండు హెలికాప్టర్లను సైతం రంగంలోకి దించినట్లు సమాచారం.
మెరైన్ పోలీసులు, సంబంధిత అధికారులు సమన్వయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గల్లంతైన విద్యార్థి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
రుషికొండ సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థి కోసం అన్ని మార్గాల్లో అన్వేషణ కొనసాగుతోంది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: