PRAJA MUDRA
రిపోర్టర్
మీ ప్రాంత వార్తల కోసం లొకేషన్ ఆన్ చేయండి
Breaking
⚡ BREAKING

విద్యుత్ బిల్లుల పేరుతో వచ్చే నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Breaking
⚡ BREAKING

రైతులకు పంటల బీమాపై భరోసా.. రబీ 2026-27 బీమా పోర్టల్ ప్రారంభం

Breaking
⚡ BREAKING

పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

Breaking
⚡ BREAKING

ఫేజ్‌-1 పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు

Breaking
⚡ BREAKING

ష్రేష్ఠ (NETS) ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

ఫ్లిప్ న్యూస్
ప్రపంచం (World)
క్రీడలు (Sports)
ఈ-పేపర్
లైవ్ టీవీ
రీల్స్ / షార్ట్స్
🗳️ ELECTION LIVE
Manage

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

ఆంధ్రప్రదేశ్ వార్తలు

అన్ని వార్తలు ×
Thumb
📍 అనకాపల్లి

విద్యుత్ బిల్లుల పేరుతో వచ్చే నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

16 గం. క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

రైతులకు పంటల బీమాపై భరోసా.. రబీ 2026-27 బీమా పోర్టల్ ప్రారంభం

1 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

1 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

ఫేజ్‌-1 పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు

2 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

ష్రేష్ఠ (NETS) ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

2 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 విశాఖపట్నం

ఇంటి తాళం తెరిచి బంగారం, నగదు చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్

3 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

పొగ, ఆక్రమణల నుంచి విముక్తి కల్పించండి

3 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 విశాఖపట్నం

రుషికొండ బీచ్‌లో విషాదం.. సముద్రంలో గల్లంతైన బీకాం విద్యార్థి

3 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

మత్స్యరంగంలో యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.54.08 లక్షలు

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.54.08 లక్షలు

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

నూకాంబిక ఆలయ భూమి కొనుగోలులో తొమ్మిదేళ్ల జాప్యం!

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

ప్రేమ, పెళ్లి పేరుతో యువతికి మోసం.. నిందితుడికి ఏడాది జైలు

5 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా మోటూరు నాగమణి,వైస్ చైర్‌పర్సన్‌గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక

5 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

ఎన్నికల వేళ గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు

6 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

అనకాపల్లి జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు

6 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 విశాఖపట్నం

అక్వాన్ తుపానుతో ఉత్తరాంధ్రకు ముప్పు

7 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

మోటార్ సైకిల్ చోరీ కేసులో నిందితుడికి 8 నెలల జైలు శిక్ష

7 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

రహదారి ప్రమాదాల నివారణపై పోలీసుల ప్రత్యేక దృష్టి.. బ్లాక్ స్పాట్ల వద్ద భద్రతా బోర్డుల ఏర్పాటు

7 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

అక్వాన్ తుఫానుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం.. ముందస్తు చర్యలు చేపట్టాలి

7 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 గుంటూరు

పోలీసులను కారుతో ఢీకొట్టిన బీజేపీ అభ్యర్థిని తక్షణమే అరెస్టు చేయాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య

9 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 తూర్పు గోదావరి

మొబైల్ టెక్నీషియన్లకు భరోసా.. డిజిటల్ సేవలకు ‘ఎంఎస్ఎం’ యాప్

9 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 గుంటూరు

బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ముప్పు.. ఏపీకి భారీ వర్ష సూచన!

9 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 శ్రీకాకుళం

ధరల భారంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు: మాజీ మంత్రి ధర్మాన

10 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

కార్మికులకు రక్షణ ఏది? పరిశ్రమల యజమానులకేనా ప్రభుత్వ భరోసా?

10 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

శాఖవీధి ప్రభుత్వ గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

10 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు పరవాడ క్రీడాకారుడు పైల దుష్యంత్ ఎంపిక

10 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 గుంటూరు

అమరావతికి రైల్వే కనెక్టివిటీ.. రాజధాని అభివృద్ధికి కొత్త దిశ!

11 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 గుంటూరు

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ముఖ్య సమాచారం.. ఖర్చు పరిమితులు, డిపాజిట్ వివరాలు ఇవే!

11 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 విశాఖపట్నం

ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు భారీ ప్రోత్సాహకాలు.. గరిష్ఠంగా రూ.50 లక్షలు!

11 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 గుంటూరు

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల

11 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

మధుమేహంపై ముందస్తు చర్యలతో వ్యాధి నియంత్రణ సాధ్యం

11 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

నెల రోజుల చిన్నారికి ప్రపంచ రికార్డు గుర్తింపు

11 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

అనకాపల్లి నిదానం దొడ్డిలో శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలకు శ్రీకారం

11 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 విశాఖపట్నం

అంతర్జాతీయ వేదికపై ఏటికొప్పాక కళాకృతులకు విశేష గుర్తింపు

11 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 విశాఖపట్నం

ఏపీలో పెట్టుబడిదారులకు చట్టపరమైన భరోసా.. ప్రత్యేక చట్టం దిశగా చంద్రబాబు ప్రభుత్వం!

13 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 విశాఖపట్నం

పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌ల పేరుతో ప్రచార ఆర్భాటం.. ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ విమర్శలు

13 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

అనకాపల్లిలో ఇంటి దొంగతనం కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్

13 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 విశాఖపట్నం

విశాఖలో ఘనంగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం

13 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 విశాఖపట్నం

ఏపీలో రెన్యూ సంస్థ ప్రాజెక్టుల విస్తరణపై సీఎం చంద్రబాబుతో సుమంత్ సిన్హా భేటీ

13 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
16 గం. క్రితం
Logo

విద్యుత్ బిల్లుల పేరుతో వచ్చే నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఫేక్ ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాల్లోని లింకులను క్లిక్ చేయవద్దు వినియోగదారులకు ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జి. ప్రసాద్ సూచన అనకాపల్లి, నవంబర్ 25: విద్యుత్ బిల్లుల చెల్లింపుల పేరుతో సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న నకిలీ ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాల పట్ల విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ అనకాపల్లి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ జి. ప్రసాద్ సూచించారు. విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే బిల్లు చెల్లించకపోతే అదే రోజు రాత్రి 8 గంటల తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరిస్తూ గుర్తుతెలియని మొబైల్ నంబర్ల నుంచి కొంతమంది వినియోగదారులకు నకిలీ సందేశాలు...

ఫేక్ ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాల్లోని లింకులను క్లిక్ చేయవద్దు వినియోగదారులకు ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జి. ప్రసాద్ సూచన అనకాపల్లి, నవంబర్ 25: విద్యుత్ బిల్లుల చెల్లింపుల పేరుతో సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న నకిలీ ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాల పట్ల విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ అనకాపల్లి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ జి. ప్రసాద్ సూచించారు. విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే బిల్లు చెల్లించకపోతే అదే రోజు రాత్రి 8 గంటల తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరిస్తూ గుర్తుతెలియని మొబైల్ నంబర్ల నుంచి కొంతమంది వినియోగదారులకు నకిలీ సందేశాలు వస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ బిల్లు చెల్లింపులు అప్‌డేట్ చేయాలని, సందేశంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా లింక్ ద్వారా చెల్లింపులు చేయాలని సూచించే ఇటువంటి సందేశాలను నమ్మవద్దని స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లు పంపించే నకిలీ ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాల్లోని లింకులను క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత, బ్యాంకు వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల వినియోగదారులు గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయరాదని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదని సూచించారు. అనుమానాస్పద సందేశాల్లో పేర్కొన్న ఫోన్ నంబర్లకు స్పందించకుండా, విద్యుత్ బిల్లులు, చెల్లింపులకు సంబంధించిన వివరాలను అధికారిక మార్గాల ద్వారానే నిర్ధారించుకోవాలని కోరారు. విద్యుత్ బిల్లు చెల్లింపులు, విద్యుత్ సరఫరా, ఇతర సేవలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే ఏపీఈపీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912కు లేదా వాట్సాప్ నంబర్ 9493681912 చాట్ ద్వారా సంప్రదించాలని ఎస్ఈ సూచించారు. విద్యుత్ వినియోగదారులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, ఇటువంటి నకిలీ సందేశాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • అనకాపల్లి News
Reporter
PRAJAMUDRA
1 రోజుల క్రితం
Logo

రైతులకు పంటల బీమాపై భరోసా.. రబీ 2026-27 బీమా పోర్టల్ ప్రారంభం

పంట నష్టాలకు ఆర్థిక రక్షణ కల్పించడమే లక్ష్యం – కలెక్టర్ విజయ కృష్ణన్ అనకాపల్లి, నవంబర్ 24: ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. రబీ 2024-25, ఖరీఫ్ 2025 పంటల బీమాకు సంబంధించి అర్హులైన రైతుల జాబితాను జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమోదించారు. అలాగే రబీ 2026-27 సీజన్‌కు సంబంధించిన పంటల బీమా పోర్టల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫానులు, కరువు, అకాల వర్షాలు...

పంట నష్టాలకు ఆర్థిక రక్షణ కల్పించడమే లక్ష్యం – కలెక్టర్ విజయ కృష్ణన్ అనకాపల్లి, నవంబర్ 24: ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. రబీ 2024-25, ఖరీఫ్ 2025 పంటల బీమాకు సంబంధించి అర్హులైన రైతుల జాబితాను జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమోదించారు. అలాగే రబీ 2026-27 సీజన్‌కు సంబంధించిన పంటల బీమా పోర్టల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫానులు, కరువు, అకాల వర్షాలు తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడులు కోల్పోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. క్లస్టర్-7 పరిధిలోని అనకాపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కర్నూలు జిల్లాల్లో టాటా ఏఐజీ బీమా సంస్థ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తున్న రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఈ పథకంలో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం ఎంపిక చేసిన వ్యవసాయ పంటలైన వరి, మినుము, పెసలకు బీమా చేసిన మొత్తంలో 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. వాణిజ్య, ఉద్యాన పంటలైన మామిడి, జీడిమామిడికి బీమా చేసిన మొత్తంలో 5 శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన రైతులకు సంబంధిత బ్యాంకులే ప్రీమియం వసూలు చేసి బీమా సంస్థకు చెల్లిస్తాయి. బీమా పథకంలో కొనసాగడం ఇష్టం లేని రైతులు గడువు తేదీకి కనీసం ఏడు రోజుల ముందుగా సంబంధిత బ్యాంకుకు లిఖితపూర్వకంగా తెలియజేయాలి. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు పంట రుణం పొందని రైతులు ఆధార్ కార్డు, భూమి పట్టాదారు పాస్ పుస్తకం లేదా కౌలు కార్డు, పంట సాగు చేసినట్లు స్వీయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), పోస్టాఫీసుల ద్వారా లేదా నేరుగా NCIP పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకునే అవకాశం ఉంది. రైతులు బీమా చేసిన పంట వివరాలు ఈ-క్రాప్‌లో సరిగ్గా నమోదయ్యాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా గడువు తేదీకి ముందే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని, దళారులు, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. పంటల వారీగా బీమా నమోదు గడువులు - వరి పంట – 31 డిసెంబర్ 2026 - మినుము, పెసలు – 15 డిసెంబర్ 2026 - మామిడి – 31 డిసెంబర్ 2026 - జీడిమామిడి – 15 నవంబర్ 2026 ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, ఎల్‌డీఎం, టాటా ఏఐజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
🗳️ ELECTION LIVE
Manage

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
1 రోజుల క్రితం
Logo

పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

అనకాపల్లి, నవంబర్ 24: ఏళ్ల తరబడి న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న రాజీపడదగ్గ కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు డిసెంబర్ 12, 2026న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, భూవివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకింగ్, మనీ రికవరీ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే మోటార్...

అనకాపల్లి, నవంబర్ 24: ఏళ్ల తరబడి న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న రాజీపడదగ్గ కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు డిసెంబర్ 12, 2026న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, భూవివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకింగ్, మనీ రికవరీ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే మోటార్ ప్రమాదాల నష్టపరిహార కేసులు, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు, కుటుంబ వివాదాలు, మెయింటెనెన్స్ పిటిషన్లు, కార్మిక మరియు పారిశ్రామిక వివాదాలను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, ధనం ఆదా కావడంతో పాటు సుదీర్ఘ న్యాయ ప్రక్రియ నుంచి ఉపశమనం లభిస్తుందని ఎస్పీ వివరించారు. ఇరుపక్షాల అంగీకారంతో వివాదాలు పరిష్కారం కావడం వల్ల పరస్పర శత్రుత్వం తగ్గి సత్సంబంధాలు కొనసాగుతాయన్నారు. లోక్ అదాలత్‌లో ఇరుపక్షాల అంగీకారంతో వెలువడే అవార్డు సివిల్ కోర్టు డిక్రీతో సమానమని, దానిపై అప్పీల్‌కు అవకాశం ఉండదని తెలిపారు. సంప్రదించాల్సిన వివరాలు: తమ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలనుకునే వారు సమీప పోలీస్ స్టేషన్‌ను, తమ న్యాయవాదులను లేదా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాలను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం విశాఖపట్నంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయ సేవా సదన్‌లో పనిచేస్తోంది. అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల మండల న్యాయ సేవా సంఘాలను కూడా సంప్రదించవచ్చు. ఫోన్: 0891-2560414, 0891-2575046 టోల్ ఫ్రీ: 15100 ఈ-మెయిల్: vskpdlsa@yahoo.com, dlsa.vsp@gmail.com రాజీ మార్గమే రాజమార్గమనే స్ఫూర్తితో వివాదరహిత, ప్రశాంత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ తుహిన్ సిన్హా విజ్ఞప్తి చేశారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
2 రోజుల క్రితం
Logo

ఫేజ్‌-1 పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు

శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి: ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి, నవంబర్ 23: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ముందస్తు భద్రతా చర్యలపై సమీక్షించారు. జిల్లాలో ఫేజ్‌-1 ఎన్నికలు జరగనున్న ఎనిమిది మండలాల్లోని 353 పోలింగ్ లొకేషన్లను సమస్యాత్మకత ఆధారంగా గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటిలో 71 అతి సమస్యాత్మక,...

ముఖ్యమైన పాయింట్స్:

  • శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి: ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి, నవంబర్ 23: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ముందస్తు భద్రతా చర్యలపై సమీక్షించారు. జిల్లాలో ఫేజ్‌-1 ఎన్నికలు జరగనున్న ఎనిమిది మండలాల్లోని 353 పోలింగ్ లొకేషన్లను సమస్యాత్మకత ఆధారంగా గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటిలో 71 అతి సమస్యాత్మక, 108 సమస్యాత్మక, 174 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. అతి సమస్యాత్మక కేంద్రాల్లో అవసరాన్ని బట్టి 1+4, 1+2 పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక కేంద్రాల్లో 1+1, సాధారణ కేంద్రాల్లో ఒక పోలీసు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 95 రూట్ మొబైల్ బృందాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని, ప్రతి మండలానికి కనీసం మూడు స్ట్రైకింగ్ ఫోర్సులతో పాటు ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అదనపు ఎస్పీ, ఎస్పీ ఆధ్వర్యంలో రిజర్వ్ బలగాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వాహనాల్లో ప్రత్యేక పరికరాలు తప్పనిసరి ప్రతి రూట్ మొబైల్, స్ట్రైకింగ్ ఫోర్స్ వాహనంలో మైక్, లౌడ్ స్పీకర్‌తో కూడిన పీఏ సిస్టమ్, సైరన్, తగినన్ని లాఠీలు తప్పనిసరిగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో బాడీ ఓర్న్ కెమెరాలను వినియోగించాలని సూచించారు. ఈ ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ప్రహరీ గోడలు లేని పోలింగ్ కేంద్రాల వద్ద ఎంపీడీఓలు, ఎంఆర్ఓలతో సమన్వయం చేసుకుని ఎన్నికలకు ముందే తాత్కాలిక ఫెన్సింగ్ లేదా బారికేడింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సిగ్నల్ సమస్యలు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, పోలింగ్ రోజున ప్రతి గంట లేదా రెండు గంటలకు సమాచారం అందేలా ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. సమస్యాత్మక వ్యక్తులపై ప్రత్యేక నిఘా రౌడీషీటర్లు, బైండోవర్ అయిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం వారు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల 100 నుంచి 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుంపులుగా చేరకుండా, ఓటు వేసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయేలా పీఏ సిస్టమ్ ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. కౌంటింగ్ సమయంలోనూ అప్రమత్తత పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు కూడా నిర్వహించనున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. కేంద్రాల వెలుపల అనవసరంగా గుంపులు చేరకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మద్యం విక్రయాలపై కఠిన చర్యలు ఎన్నికలకు 48 గంటల ముందు నుంచే మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేయించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడా బెల్ట్ షాపులు నిర్వహించడానికి వీల్లేదని, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత సబ్‌డివిజన్ డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఎలక్షన్ సెల్ అధికారులు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
2 రోజుల క్రితం
Logo

ష్రేష్ఠ (NETS) ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తులకు నవంబర్ 30 చివరి తేదీ.. జనవరి 10న ప్రవేశ పరీక్ష అనకాపల్లి: 2027–28 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ష్రేష్ఠ (SHRESHTA) పథకం ద్వారా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పథకం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) SHRESHTA (NETS) ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తులకు నవంబర్ 30, 2026 చివరి తేదీగా నిర్ణయించగా, ప్రవేశ...

దరఖాస్తులకు నవంబర్ 30 చివరి తేదీ.. జనవరి 10న ప్రవేశ పరీక్ష అనకాపల్లి: 2027–28 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ష్రేష్ఠ (SHRESHTA) పథకం ద్వారా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పథకం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) SHRESHTA (NETS) ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తులకు నవంబర్ 30, 2026 చివరి తేదీగా నిర్ణయించగా, ప్రవేశ పరీక్షను 2027 జనవరి 10న నిర్వహించనున్నారు. అనకాపల్లి జిల్లాలోని అర్హులైన పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారులు సూచించారు. అర్హత కలిగిన విద్యార్థులు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ముఖ్య సమాచారం: - విద్యా సంవత్సరం: 2027–28 - పథకం: SHRESHTA (NETS) - దరఖాస్తులకు చివరి తేదీ: 30-11-2026 - ప్రవేశ పరీక్ష తేదీ: 10-01-2027 - నిర్వహణ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) — ప్రజాముద్ర NEWS
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 విశాఖపట్నం • గాజువాక News
Reporter
PRAJAMUDRA
3 రోజుల క్రితం
Logo

ఇంటి తాళం తెరిచి బంగారం, నగదు చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్

21.70 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,500 నగదు స్వాధీనం విశాఖపట్నం, ప్రజాముద్ర ప్రతినిధి: ఇంటి తాళం తెరిచి బంగారు ఆభరణాలు, నగదు అపహరించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును గాజువాక క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 21.70 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.2,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం సిటీ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ వెంకటరావు ఆధ్వర్యంలో సౌత్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ​అసలేం జరిగిందంటే.. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2:30...

ముఖ్యమైన పాయింట్స్:

  • 21.70 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,500 నగదు స్వాధీనం
విశాఖపట్నం, ప్రజాముద్ర ప్రతినిధి: ఇంటి తాళం తెరిచి బంగారు ఆభరణాలు, నగదు అపహరించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును గాజువాక క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 21.70 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.2,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం సిటీ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ వెంకటరావు ఆధ్వర్యంలో సౌత్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ​అసలేం జరిగిందంటే.. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో గాజువాక శ్రీనగర్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఓ ఇంటిని తిరుపతికి చెందిన చందక మణికంఠ @ శ్రీకాంత్ (29), బదురు వాసు (32) లక్ష్యంగా చేసుకున్నారు. వాసు ఇంటి బయట కాపలా కాయగా, మణికంఠ ఇంటి ముందున్న కరెంట్ మీటర్‌పై ఉంచిన తాళం చెవులతో లోపలికి ప్రవేశించాడు. ఇనుప రాడ్డుతో బీరువాను పగులగొట్టి అందులోని బంగారు, వెండి వస్తువులు, నగదును దోచుకెళ్లాడు. ​తాకట్టు పెట్టి జల్సాలు: దొంగిలించిన బంగారంలో ఒక చైన్‌ను తమిళనాడు రాష్ట్రం గుమ్మిడిపూండికి చెందిన మునికృష్ణ B.R. (40) సహాయంతో బజాజ్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.1,52,069 రుణం తీసుకున్నారు. ఆ సొమ్మును ముగ్గురూ పంచుకొని సొంత అవసరాలకు వాడుకున్నారు. ​పోలీసులకు చిక్కారిలా: ఆదివారం (నవంబర్ 22) గాజువాక బీసీ రోడ్డులోని బంగారు దుకాణాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ముగ్గురిని గాజువాక క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుల నుండి 16.97 గ్రాముల బంగారు మిరియాల తాడు, 2.84 గ్రాముల చెవి దిద్దులు, 1.89 గ్రాముల మూడు బంగారు కాసులతో పాటు రూ.2,500 నగదును రికవరీ చేశారు. ​పోలీసుల హెచ్చరిక: ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లేటప్పుడు తాళం చెవులను మీటర్ల పైనో, చెప్పుల స్టాండ్ కిందో దాచిపెట్టవద్దని గాజువాక క్రైమ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
3 రోజుల క్రితం
Logo

పొగ, ఆక్రమణల నుంచి విముక్తి కల్పించండి

చవితిన వీధి సమస్యలపై జిల్లా కలెక్టర్, జీవీఎంసీ అధికారులకు స్థానికుల ఫిర్యాదు అనకాపల్లి, నవంబర్ 22: చవితిన వీధి ప్రధాన రహదారిపై పెరుగుతున్న అక్రమ ఆక్రమణలు, అనధికార వంట కేంద్రాల నుంచి వెలువడుతున్న పొగతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని పొగ కాలుష్యం, రహదారి ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలోని 110వ వార్డు చవితిన వీధి ప్రధాన మార్గం సుమారు 40 అడుగుల వెడల్పు కలిగి ఉందని, అయితే రహదారిలో అధిక భాగాన్ని...

చవితిన వీధి సమస్యలపై జిల్లా కలెక్టర్, జీవీఎంసీ అధికారులకు స్థానికుల ఫిర్యాదు అనకాపల్లి, నవంబర్ 22: చవితిన వీధి ప్రధాన రహదారిపై పెరుగుతున్న అక్రమ ఆక్రమణలు, అనధికార వంట కేంద్రాల నుంచి వెలువడుతున్న పొగతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని పొగ కాలుష్యం, రహదారి ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలోని 110వ వార్డు చవితిన వీధి ప్రధాన మార్గం సుమారు 40 అడుగుల వెడల్పు కలిగి ఉందని, అయితే రహదారిలో అధిక భాగాన్ని ఆక్రమిస్తూ అనేక అనధికార నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రోజురోజుకూ ఆక్రమణలు పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల రహదారి ఆక్రమణల మధ్య అనధికార వంట కేంద్రాలు ఏర్పాటు చేశారని, వాటి నుంచి పగలు, రాత్రి పెద్దఎత్తున పొగ వెలువడుతూ సమీప నివాసాల్లోకి వ్యాపిస్తోందని తెలిపారు. దీంతో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని, రాకపోకలను దృష్టిలో ఉంచుకుని అనధికార వంట కేంద్రాల నుంచి వెలువడే పొగ సమస్యను పరిష్కరించాలని, రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలు, వ్యాపార కేంద్రాలు, దుకాణాలను తొలగించి రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 విశాఖపట్నం • Vizag News
Reporter
PRAJAMUDRA
3 రోజుల క్రితం
Logo

రుషికొండ బీచ్‌లో విషాదం.. సముద్రంలో గల్లంతైన బీకాం విద్యార్థి

విశాఖపట్నం: విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన బుల్లయ్య కాలేజీకి చెందిన బీకాం విద్యార్థుల్లో ఒకరు గల్లంతయ్యారు. విద్యార్థి ఆచూకీ కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం బుల్లయ్య కాలేజీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు రుషికొండ బీచ్‌కు వెళ్లినట్లు సమాచారం. వారిలో నలుగురు సముద్రంలో స్నానానికి దిగగా ప్రమాదవశాత్తు ఒక విద్యార్థి సముద్రంలో గల్లంతైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు శనివారం రాత్రి నుంచి గాలింపు చర్యలు ప్రారంభించారు. టూరిజం బోట్ల సహాయంతో రాత్రంతా అన్వేషణ కొనసాగించారు. ఆదివారం ఉదయం నుంచి షిప్‌ ద్వారా సముద్రంలో గాలింపు చేపట్టారు....

విశాఖపట్నం: విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన బుల్లయ్య కాలేజీకి చెందిన బీకాం విద్యార్థుల్లో ఒకరు గల్లంతయ్యారు. విద్యార్థి ఆచూకీ కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం బుల్లయ్య కాలేజీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు రుషికొండ బీచ్‌కు వెళ్లినట్లు సమాచారం. వారిలో నలుగురు సముద్రంలో స్నానానికి దిగగా ప్రమాదవశాత్తు ఒక విద్యార్థి సముద్రంలో గల్లంతైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు శనివారం రాత్రి నుంచి గాలింపు చర్యలు ప్రారంభించారు. టూరిజం బోట్ల సహాయంతో రాత్రంతా అన్వేషణ కొనసాగించారు. ఆదివారం ఉదయం నుంచి షిప్‌ ద్వారా సముద్రంలో గాలింపు చేపట్టారు. విద్యార్థి ఆచూకీ కోసం రెండు హెలికాప్టర్లను సైతం రంగంలోకి దించినట్లు సమాచారం. మెరైన్ పోలీసులు, సంబంధిత అధికారులు సమన్వయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గల్లంతైన విద్యార్థి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. రుషికొండ సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థి కోసం అన్ని మార్గాల్లో అన్వేషణ కొనసాగుతోంది.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
4 రోజుల క్రితం
Logo

మత్స్యరంగంలో యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకల్లో జిల్లా మత్స్యశాఖ అధికారి వర్ధన్ ఐస్‌బాక్స్‌లతో కూడిన ద్విచక్ర వాహనాల పంపిణీ అనకాపల్లి, నవంబర్ 21: ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి ఎల్.బి.ఎస్. వర్ధన్, సహాయ సంచాలకులు జి. విజయ, జిల్లా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు గురునాదరావు, SARDS స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మంగమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ‘మార్పు కోసం ప్రజలకు సాధికారత – మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో ముఖ్యంగా యువత, మహిళలకు గౌరవప్రదమైన...

ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకల్లో జిల్లా మత్స్యశాఖ అధికారి వర్ధన్ ఐస్‌బాక్స్‌లతో కూడిన ద్విచక్ర వాహనాల పంపిణీ అనకాపల్లి, నవంబర్ 21: ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి ఎల్.బి.ఎస్. వర్ధన్, సహాయ సంచాలకులు జి. విజయ, జిల్లా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు గురునాదరావు, SARDS స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మంగమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ‘మార్పు కోసం ప్రజలకు సాధికారత – మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో ముఖ్యంగా యువత, మహిళలకు గౌరవప్రదమైన ఉపాధి అవకాశాల కల్పన’ అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి ఎల్.బి.ఎస్. వర్ధన్ మాట్లాడుతూ మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. మత్స్య సంపద పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, స్థిరమైన మత్స్యరంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సహాయ సంచాలకులు జి. విజయ మాట్లాడుతూ మత్స్య సంపదను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన చేపల వేట పద్ధతులను అనుసరిస్తూ, భవిష్యత్ తరాలకు మత్స్య సంపదను అందించేందుకు మత్స్యకారులు సహకరించాలని సూచించారు. ఇద్దరు లబ్ధిదారులకు ఐస్‌బాక్స్‌లతో ద్విచక్ర వాహనాలు కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పథకం కింద జనరల్ కేటగిరీకి చెందిన ఇద్దరు లబ్ధిదారులు పగి బాలరాజు, యర్రవారపు శివలకు ఐస్‌బాక్స్‌లతో కూడిన టీవీఎస్ ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. చేపల రవాణా, విక్రయాలకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడటంతో పాటు మత్స్యకారుల ఆదాయాభివృద్ధికి దోహదపడతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మత్స్యకార సంఘాల అధ్యక్షులు, మత్స్యకారులు, మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
4 రోజుల క్రితం
Logo

నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.54.08 లక్షలు

నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.54.08 లక్షలు 77 రోజుల కానుకల లెక్కింపులో 20.05 గ్రాముల బంగారం, 1.060 కిలోల వెండి లభ్యం అమ్మవారిపై భక్తుల అచంచల విశ్వాసానికి హుండీ కానుకలే నిదర్శనం – ఈఓ, చైర్మన్ అనకాపల్లి: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, భక్తుల ఆరాధ్య దైవంగా కొలువుదీరిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.54,08,952 ఆదాయం సమకూరింది. 77 రోజుల వ్యవధిలో భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం లభించింది. శుక్రవారం దేవస్థాన అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, సంబంధిత పర్యవేక్షకుల సమక్షంలో...

నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.54.08 లక్షలు 77 రోజుల కానుకల లెక్కింపులో 20.05 గ్రాముల బంగారం, 1.060 కిలోల వెండి లభ్యం అమ్మవారిపై భక్తుల అచంచల విశ్వాసానికి హుండీ కానుకలే నిదర్శనం – ఈఓ, చైర్మన్ అనకాపల్లి: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, భక్తుల ఆరాధ్య దైవంగా కొలువుదీరిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.54,08,952 ఆదాయం సమకూరింది. 77 రోజుల వ్యవధిలో భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం లభించింది. శుక్రవారం దేవస్థాన అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, సంబంధిత పర్యవేక్షకుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించారు. ఈ లెక్కింపులో నగదుతో పాటు 20 గ్రాముల 50 మిల్లీగ్రాముల బంగారం, ఒక కిలో 60 గ్రాముల వెండి లభించాయి. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీని కూడా భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి బుద్ద మహాలక్ష్మి నగేష్, చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు) మాట్లాడుతూ.. అమ్మవారిపై భక్తులు చూపిస్తున్న అచంచలమైన భక్తి, విశ్వాసాలకు హుండీ కానుకలు నిదర్శనమని తెలిపారు. భక్తులు సమర్పించే ప్రతి కానుక దేవస్థానానికి ఎంతో విలువైనదని, వాటిని ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు సద్వినియోగం చేస్తామని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు దేవస్థాన అభివృద్ధికి అవసరమైన చర్యలను నిరంతరం చేపడుతున్నామని వెల్లడించారు. అమ్మవారిపై భక్తులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు, విశ్వాసానికి దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు భక్తులందరిపై సదా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు: అనకాపల్లి జిల్లా దేవదాయ శాఖ అధికారి వై.వి. రమణి, దేవాదాయ శాఖ తనిఖీదారు బి. వసంతకుమార్, దేవస్థాన చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు, యర్రవరపు సంతోషి కుమారి నాగేష్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
4 రోజుల క్రితం
Logo

నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.54.08 లక్షలు

నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.54.08 లక్షలు 77 రోజుల కానుకల లెక్కింపులో 20.05 గ్రాముల బంగారం, 1.060 కిలోల వెండి లభ్యం అమ్మవారిపై భక్తుల అచంచల విశ్వాసానికి హుండీ కానుకలే నిదర్శనం – ఈఓ, చైర్మన్ అనకాపల్లి: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, భక్తుల ఆరాధ్య దైవంగా కొలువుదీరిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.54,08,952 ఆదాయం సమకూరింది. 77 రోజుల వ్యవధిలో భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం లభించింది. శుక్రవారం దేవస్థాన అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, సంబంధిత పర్యవేక్షకుల సమక్షంలో...

నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.54.08 లక్షలు 77 రోజుల కానుకల లెక్కింపులో 20.05 గ్రాముల బంగారం, 1.060 కిలోల వెండి లభ్యం అమ్మవారిపై భక్తుల అచంచల విశ్వాసానికి హుండీ కానుకలే నిదర్శనం – ఈఓ, చైర్మన్ అనకాపల్లి: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, భక్తుల ఆరాధ్య దైవంగా కొలువుదీరిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.54,08,952 ఆదాయం సమకూరింది. 77 రోజుల వ్యవధిలో భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం లభించింది. శుక్రవారం దేవస్థాన అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, సంబంధిత పర్యవేక్షకుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించారు. ఈ లెక్కింపులో నగదుతో పాటు 20 గ్రాముల 50 మిల్లీగ్రాముల బంగారం, ఒక కిలో 60 గ్రాముల వెండి లభించాయి. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీని కూడా భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి బుద్ద మహాలక్ష్మి నగేష్, చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు) మాట్లాడుతూ.. అమ్మవారిపై భక్తులు చూపిస్తున్న అచంచలమైన భక్తి, విశ్వాసాలకు హుండీ కానుకలు నిదర్శనమని తెలిపారు. భక్తులు సమర్పించే ప్రతి కానుక దేవస్థానానికి ఎంతో విలువైనదని, వాటిని ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు సద్వినియోగం చేస్తామని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు దేవస్థాన అభివృద్ధికి అవసరమైన చర్యలను నిరంతరం చేపడుతున్నామని వెల్లడించారు. అమ్మవారిపై భక్తులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు, విశ్వాసానికి దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు భక్తులందరిపై సదా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు: అనకాపల్లి జిల్లా దేవదాయ శాఖ అధికారి వై.వి. రమణి, దేవాదాయ శాఖ తనిఖీదారు బి. వసంతకుమార్, దేవస్థాన చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు, యర్రవరపు సంతోషి కుమారి నాగేష్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
4 రోజుల క్రితం
Logo

నూకాంబిక ఆలయ భూమి కొనుగోలులో తొమ్మిదేళ్ల జాప్యం!

అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరపాలి.. డాక్టర్ బి.ఎం. నాయుడు విజ్ఞప్తి అనకాపల్లి: అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానానికి సమీపంలోని తన కుటుంబ వారసత్వ భూమి కొనుగోలు ప్రక్రియ తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో ఉందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ డాక్టర్ బి.ఎం. నాయుడు దేవాదాయ శాఖ అధికారులను కోరారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. డాక్టర్ బి.ఎం. నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి ఓల్డ్ ఫోర్ట్ వార్డు పరిధిలోని నూకాంబిక ఆలయం సమీపంలో సర్వే నంబర్ 559/7లో తమ...

ముఖ్యమైన పాయింట్స్:

  • అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరపాలి.. డాక్టర్ బి.ఎం. నాయుడు విజ్ఞప్తి
అనకాపల్లి: అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానానికి సమీపంలోని తన కుటుంబ వారసత్వ భూమి కొనుగోలు ప్రక్రియ తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో ఉందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ డాక్టర్ బి.ఎం. నాయుడు దేవాదాయ శాఖ అధికారులను కోరారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. డాక్టర్ బి.ఎం. నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి ఓల్డ్ ఫోర్ట్ వార్డు పరిధిలోని నూకాంబిక ఆలయం సమీపంలో సర్వే నంబర్ 559/7లో తమ కుటుంబానికి వారసత్వంగా 48 సెంట్ల భూమి ఉందని తెలిపారు. ఇందులో 40 సెంట్ల భూమిని దేవస్థానం ఇప్పటికే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. మిగిలిన 8 సెంట్ల భూమిని కూడా ఆలయ అభివృద్ధి అవసరాల కోసం విక్రయించేందుకు 2017 ఫిబ్రవరి 9న అధికారికంగా అంగీకార పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ భూమి కొనుగోలుకు విజయవాడలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రక్రియ ముందుకు సాగలేదని ఆయన ఆరోపించారు. భూ రికార్డుల మార్పులపై అనుమానాలు సర్వే నంబర్ 559/7కు సంబంధించి ఆన్‌లైన్ మీ భూమి రికార్డుల్లో కొండ్రేగుల అప్పన్న అనే వ్యక్తి పేరు నమోదై ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పేరు ఏ ప్రాతిపదికన నమోదు చేశారు? మ్యుటేషన్‌కు ఎవరు ఆమోదం తెలిపారు? భూ రికార్డుల్లో మార్పులకు బాధ్యులెవరు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అలాగే దేవస్థానం కొనుగోలు చేసిన ఇతర భూములకు సంబంధించిన ఎఫ్‌ఎంబీ (FMB) స్కెచ్‌లు జత చేయకపోవడం వల్ల తమ స్థలానికి సంబంధించిన వివరాలను గుర్తించడం కష్టంగా మారిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, భూమి వ్యవహారం పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని డాక్టర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీఐ దరఖాస్తులు, నోటీసులు ఇచ్చినప్పటికీ సమగ్ర సమాధానాలు లభించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తొమ్మిదేళ్ల జాప్యానికి గల కారణాలను వెల్లడించాలని, కొనుగోలు ప్రక్రియను నిలిపివేయడానికి బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భూ రికార్డుల మార్పులపై విచారణ జరిపి తమ కుటుంబానికి చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే సమస్యను పరిష్కరించకపోతే తమ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు. – ప్రజా ముద్ర NEWS
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
5 రోజుల క్రితం
Logo

ప్రేమ, పెళ్లి పేరుతో యువతికి మోసం.. నిందితుడికి ఏడాది జైలు

రూ.20 వేల జరిమానా విధించిన విశాఖ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం విచారణాధికారిగా ప్రస్తుత అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి, నవంబర్ 20: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని నమ్మించి మోసగించిన కేసులో నిందితుడికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన ఈ కేసులో విశాఖపట్నంలోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం (XI అదనపు జిల్లా జడ్జి కోర్టు) ఈ తీర్పు వెలువరించింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్.రాయవరం మండలం భీమవరం గ్రామానికి చెందిన గనిశెట్టి త్రినాథ్ అదే గ్రామానికి చెందిన...

ముఖ్యమైన పాయింట్స్:

  • రూ.20 వేల జరిమానా విధించిన విశాఖ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం
  • విచారణాధికారిగా ప్రస్తుత అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి, నవంబర్ 20: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని నమ్మించి మోసగించిన కేసులో నిందితుడికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన ఈ కేసులో విశాఖపట్నంలోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం (XI అదనపు జిల్లా జడ్జి కోర్టు) ఈ తీర్పు వెలువరించింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్.రాయవరం మండలం భీమవరం గ్రామానికి చెందిన గనిశెట్టి త్రినాథ్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. యలమంచిలి మండలంలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్న సమయంలో ఆమెకు పరిచయమై, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటానని నమ్మించాడు. అయితే వివాహం చేసుకోవాలని యువతి కోరినప్పుడు కులం పేరుతో నిరాకరించి మోసగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 2020 జూన్ 16న ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 479/2020 కింద ఐపీసీ సెక్షన్లు 417, 376తో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుత ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు ఈ కేసు నమోదైన సమయంలో నర్సీపట్నం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహించిన ప్రస్తుత అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. నిందితుడిని 2020 జూన్ 22న అరెస్టు చేసి, కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడు గనిశెట్టి త్రినాథ్‌ను ఐపీసీ సెక్షన్ 417 కింద దోషిగా నిర్ధారించింది. సీఆర్‌పీసీ సెక్షన్ 235(2) ప్రకారం ఏడాది జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. మీనాతో పాటు, సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరిచిన ఎస్.రాయవరం పోలీసు సిబ్బంది, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (CMS) సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయం వెల్లడించింది. ప్రజాముద్ర NEWS | అనకాపల్లి
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
5 రోజుల క్రితం
Logo

అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా మోటూరు నాగమణి,వైస్ చైర్‌పర్సన్‌గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక

అనకాపల్లి, నవంబర్ 20: అనకాపల్లి జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా పరవాడ జడ్పీటీసీ సభ్యురాలు మోటూరు నాగమణి, వైస్ చైర్‌పర్సన్‌గా మునగపాక జడ్పీటీసీ సభ్యురాలు పెంటకోట స్వాతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ అధ్యక్షతన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించారు. ముందుగా జిల్లాలోని 24 మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్పీటీసీ సభ్యులతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. మోటూరు నాగమణి పేరును నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ ప్రతిపాదించగా, కశింకోట జడ్పీటీసీ సభ్యురాలు పొన్నగంటి...

అనకాపల్లి, నవంబర్ 20: అనకాపల్లి జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా పరవాడ జడ్పీటీసీ సభ్యురాలు మోటూరు నాగమణి, వైస్ చైర్‌పర్సన్‌గా మునగపాక జడ్పీటీసీ సభ్యురాలు పెంటకోట స్వాతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ అధ్యక్షతన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించారు. ముందుగా జిల్లాలోని 24 మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్పీటీసీ సభ్యులతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. మోటూరు నాగమణి పేరును నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ ప్రతిపాదించగా, కశింకోట జడ్పీటీసీ సభ్యురాలు పొన్నగంటి నాగమణి బలపరిచారు. మిగిలిన సభ్యులంతా ఆమోదం తెలపడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా వైస్ చైర్‌పర్సన్ పదవికి పెంటకోట స్వాతి పేరును అనకాపల్లి జడ్పీటీసీ సభ్యుడు పల్లెల నాగేశ్వరరావు ప్రతిపాదించగా, బుచ్చయ్యపేట జడ్పీటీసీ సభ్యురాలు పోతుల భవాని బలపరిచారు. సభ్యులందరి ఆమోదంతో పెంటకోట స్వాతి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ, జిల్లాలోని 24 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికైన సభ్యులందరూ ప్రమాణ స్వీకారం, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా ముగిశాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయకుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు. ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులను మంత్రి అనిత, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాముద్ర NEWS | అనకాపల్లి
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
6 రోజుల క్రితం
Logo

ఎన్నికల వేళ గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు

రేబాక, శంకరం గ్రామాల్లో అనకాపల్లి రూరల్ పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమం అనకాపల్లి, నవంబర్ 19: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అనకాపల్లి రూరల్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అనకాపల్లి మండలంలోని రేబాక, శంకరం గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్న 144 సెక్షన్...

ముఖ్యమైన పాయింట్స్:

  • రేబాక, శంకరం గ్రామాల్లో అనకాపల్లి రూరల్ పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమం
అనకాపల్లి, నవంబర్ 19: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అనకాపల్లి రూరల్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అనకాపల్లి మండలంలోని రేబాక, శంకరం గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్న 144 సెక్షన్ (ప్రస్తుత చట్ట ప్రకారం 163 బీఎన్ఎస్ఎస్), 30 పోలీస్ యాక్ట్, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో యువత, గ్రామస్తులు సంయమనం పాటించాలని, రాజకీయ విభేదాలతో గొడవలకు దిగడం, వర్గాలుగా విడిపోయి అశాంతి సృష్టించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో జరిగే ఘర్షణలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారని, అవసరమైతే రౌడీషీట్లు తెరవడం, బైండోవర్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఎదురైతే వెంటనే ఎన్నికల అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు వార్తలు, నిరాధార ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు అవసరమైన క్యారెక్టర్ సర్టిఫికెట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని యువతకు వివరించారు. ఇప్పటికే గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పలువురిపై బైండోవర్ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి గొడవలు, అల్లర్లకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలతో పాటు బైండోవర్ బాండ్ ప్రకారం ఆర్థిక జరిమానా విధించే అవకాశం ఉంటుందని వివరించారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ప్రజలు నేరుగా ఇళ్లకు వెళ్లాలని, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా గుమిగూడరాదని సూచించారు. ఎన్నికల ఫలితాల అనంతరం అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, వీధుల్లో గుంపులుగా తిరగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి రూరల్ సీఐ జి. అశోక్ కుమార్, ఎస్ఐ జి. రవి కుమార్, హెచ్‌సీ ఎస్. శంకర్, కానిస్టేబుల్ వెంకటేష్ పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
6 రోజుల క్రితం
Logo

అనకాపల్లి జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు

642 గ్రామ పంచాయతీలు.. 6,258 వార్డులకు ఎన్నికలు 12.28 లక్షల మంది ఓటర్లు.. 6,335 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్ అనకాపల్లి, నవంబర్ 19 (ప్రజాముద్ర): అనకాపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లాలోని 24 మండలాల పరిధిలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ వెల్లడించారు. జిల్లాలో మొత్తం 642 గ్రామ పంచాయతీలు, 6,258 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 6,335 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు....

ముఖ్యమైన పాయింట్స్:

  • 642 గ్రామ పంచాయతీలు.. 6,258 వార్డులకు ఎన్నికలు
  • 12.28 లక్షల మంది ఓటర్లు.. 6,335 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
  • నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్
అనకాపల్లి, నవంబర్ 19 (ప్రజాముద్ర): అనకాపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లాలోని 24 మండలాల పరిధిలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ వెల్లడించారు. జిల్లాలో మొత్తం 642 గ్రామ పంచాయతీలు, 6,258 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 6,335 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 12,28,253 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 5,98,959 మంది పురుషులు, 6,29,277 మంది మహిళలు, 17 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మొదటి విడత – నవంబర్ 26 మొదటి విడతలో 8 మండలాల పరిధిలోని 215 గ్రామ పంచాయతీలు, 2,140 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 2,197 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,55,232 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడత – నవంబర్ 29 రెండో విడతలో 8 మండలాల పరిధిలో 213 గ్రామ పంచాయతీలు, 2,072 వార్డులకు పోలింగ్ జరగనుంది. 2,092 పోలింగ్ కేంద్రాల్లో 4,17,399 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మూడో విడత – డిసెంబర్ 2 మూడో విడతలో మిగిలిన 8 మండలాల పరిధిలో 214 గ్రామ పంచాయతీలు, 2,046 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 2,046 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 3,55,619 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ తెలిపారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 విశాఖపట్నం • Anakapalli News
Reporter
PRAJAMUDRA
7 రోజుల క్రితం
Logo

అక్వాన్ తుపానుతో ఉత్తరాంధ్రకు ముప్పు

శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన ప్రజాముద్ర, విశాఖపట్నం, నవంబర్ 18: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తీవ్ర తుపాను ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. దక్షిణమధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుపాను గత ఆరు గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం తుపాను నరసాపురానికి 500...

ముఖ్యమైన పాయింట్స్:

  • శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం
  • గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
ప్రజాముద్ర, విశాఖపట్నం, నవంబర్ 18: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తీవ్ర తుపాను ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. దక్షిణమధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుపాను గత ఆరు గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం తుపాను నరసాపురానికి 500 కిలోమీటర్లు, కళింగపట్నానికి 540 కిలోమీటర్లు, చెన్నైకి 560 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 630 కిలోమీటర్లు, పూరీకి 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నానికి నరసాపురం నుంచి పూరీ మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో వర్ష సూచన తుపాను ప్రభావంతో గురువారం (నవంబర్ 19) ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సహాయక బృందాలు సిద్ధం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస ప్రాంతాల్లో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, సీతంపేటలో మరో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, విజయనగరంలో ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని అందుబాటులో ఉంచినట్లు వివరించారు. స్థానిక అగ్నిమాపక బృందాలను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు తుపాను ప్రభావం దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
7 రోజుల క్రితం
Logo

మోటార్ సైకిల్ చోరీ కేసులో నిందితుడికి 8 నెలల జైలు శిక్ష

రూ.500 జరిమానా విధించిన న్యాయస్థానం.. జరిమానా చెల్లించకుంటే మరో 7 రోజుల జైలు శిక్ష అనకాపల్లి, నవంబర్ 18 (ప్రజాముద్ర): మోటార్ సైకిల్ చోరీ కేసులో నిందితుడికి న్యాయస్థానం 8 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు రూ.500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 7 రోజుల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. ఆలయం ఎదుట పార్క్ చేసిన బైక్ చోరీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025 డిసెంబర్ 9న మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య అనకాపల్లి పట్టణంలోని లక్ష్మీదేవిపేట, పాతృడు...

ముఖ్యమైన పాయింట్స్:

  • రూ.500 జరిమానా విధించిన న్యాయస్థానం.. జరిమానా చెల్లించకుంటే మరో 7 రోజుల జైలు శిక్ష
అనకాపల్లి, నవంబర్ 18 (ప్రజాముద్ర): మోటార్ సైకిల్ చోరీ కేసులో నిందితుడికి న్యాయస్థానం 8 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు రూ.500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 7 రోజుల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. ఆలయం ఎదుట పార్క్ చేసిన బైక్ చోరీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025 డిసెంబర్ 9న మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య అనకాపల్లి పట్టణంలోని లక్ష్మీదేవిపేట, పాతృడు కాలనీలో ఉన్న సంపత్ వినాయక ఆలయం ఎదుట పార్కింగ్ చేసిన CB యూనికార్న్ మోటార్ సైకిల్ చోరీకి గురైంది. AP35 AJ 5534 నంబరు గల ఈ వాహనం తీడ అవతారానికి చెందినది. బాధితుడి ఫిర్యాదు మేరకు అనకాపల్లి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పు ఈ కేసులో తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన సాకా ప్రసాద్ (39)ను నిందితుడిగా గుర్తించారు. కేసు విచారణ అనంతరం XI అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ A. రమేష్ నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 8 నెలల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 7 రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. ఈ కేసులో అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ A. వెంకటేశ్వరరావు దర్యాప్తు నిర్వహించగా, పోలీస్ ఇన్‌స్పెక్టర్ G. ప్రేమ్ కుమార్ పర్యవేక్షించారు. ప్రభుత్వ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) L.J.J. మృణాళిని వాదనలు వినిపించారు. కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, ప్రభుత్వ న్యాయవాదిని ఉన్నతాధికారులు అభినందించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా హ్యాండిల్ లాక్ చేయాలని పోలీసులు సూచించారు. సాధ్యమైనంత వరకు అదనపు భద్రతా లాక్‌లను వినియోగించాలని, సురక్షితమైన ప్రదేశాల్లోనే వాహనాలను నిలిపి ఉంచాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Kasimkota News
Reporter
PRAJAMUDRA
7 రోజుల క్రితం
Logo

రహదారి ప్రమాదాల నివారణపై పోలీసుల ప్రత్యేక దృష్టి.. బ్లాక్ స్పాట్ల వద్ద భద్రతా బోర్డుల ఏర్పాటు

అనకాపల్లి: జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించి, వాహనదారుల ప్రాణాలకు భద్రత కల్పించే దిశగా పోలీస్ శాఖ కీలక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు అనకాపల్లి డీఎస్పీ, ట్రాఫిక్ పీఎస్ ఇన్స్పెక్టర్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అధికారులతో కలిసి పట్టణ పరిధిలోని పలు సమస్యాత్మక కూడళ్లను సందర్శించారు. ​అధికారుల బృందం ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే కొత్తూరు జంక్షన్, నూకాలమ్మ ఆర్చ్ జంక్షన్, ఉమ్మలాడ జంక్షన్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ఈ ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేందుకు స్పీడ్ లిమిట్...

అనకాపల్లి: జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించి, వాహనదారుల ప్రాణాలకు భద్రత కల్పించే దిశగా పోలీస్ శాఖ కీలక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు అనకాపల్లి డీఎస్పీ, ట్రాఫిక్ పీఎస్ ఇన్స్పెక్టర్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అధికారులతో కలిసి పట్టణ పరిధిలోని పలు సమస్యాత్మక కూడళ్లను సందర్శించారు. ​అధికారుల బృందం ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే కొత్తూరు జంక్షన్, నూకాలమ్మ ఆర్చ్ జంక్షన్, ఉమ్మలాడ జంక్షన్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ఈ ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేందుకు స్పీడ్ లిమిట్ బోర్డులు, ప్రమాద హెచ్చరిక (హజార్డ్ వార్నింగ్) బోర్డులను ఏర్పాటు చేయించారు. ​కొత్తూరు నుండి కశింకోట వరకు సెంట్రల్ లైటింగ్: రాత్రి సమయాల్లో ప్రయాణించే వాహనదారులకు స్పష్టమైన దృశ్యమానత (Visibility) ఉండేలా, కొత్తూరు జంక్షన్ నుండి కశింకోట వరకు జాతీయ రహదారి మధ్యలోని డివైడర్‌పై విద్యుత్ లైటింగ్ పోల్స్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల రాత్రిపూట జరిగే ప్రమాదాలకు అడ్డుకట్ట పడనుంది. ​వాహనదారులకు సూచన: ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలను పాటించాలని, సూచించిన వేగ పరిమితికి లోబడి వాహనాలు నడపాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
7 రోజుల క్రితం
Logo

అక్వాన్ తుఫానుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం.. ముందస్తు చర్యలు చేపట్టాలి

120–130 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం నవంబర్ 19, 20 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలు అనకాపల్లి, నవంబర్ 17 (ప్రజా ముద్ర): బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను ముప్పు నేపథ్యంలో అనకాపల్లి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం...

ముఖ్యమైన పాయింట్స్:

  • 120–130 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
  • నవంబర్ 19, 20 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలు
అనకాపల్లి, నవంబర్ 17 (ప్రజా ముద్ర): బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను ముప్పు నేపథ్యంలో అనకాపల్లి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తుఫాను ప్రభావంతో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. నవంబర్ 19, 20 తేదీల్లో అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు అందుబాటులో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, సిబ్బంది తమ తమ ప్రధాన కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండి అత్యవసర విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి 24 గంటల పాటు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తు సమయంలో ప్రజలు సంప్రదించేందుకు జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లు: - 8924-288888 - 8924-225999 పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు సిద్ధం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గుర్తించిన పునరావాస కేంద్రాలను తనిఖీ చేసి వాటి సామర్థ్యాన్ని అంచనా వేయాలని సూచించారు. అవసరమైన చోట అదనపు కేంద్రాలను గుర్తించి తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, లైటింగ్, వంట సామగ్రి, ఇతర నిత్యావసర సదుపాయాలు సిద్ధం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే గ్రామాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను అవసరమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ముఖ్యంగా హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్న ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా మత్స్యశాఖ, మెరైన్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను మత్స్యకార గ్రామాలకు చేరవేయాలని, ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకునేలా సమాచారాన్ని అందించాలని సూచించారు. వైద్య సేవలు, నిత్యావసర సరుకులకు అంతరాయం లేకుండా చర్యలు భారీ వర్షాలు, వరదల కారణంగా వ్యాధులు ప్రబలకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినంత మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రేషన్ దుకాణాలు, మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా పౌరసరఫరాల శాఖ పర్యవేక్షించాలన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పంపిణీ చేసేందుకు సురక్షిత తాగునీటి ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్, రహదారులు, సాగునీటి వ్యవస్థలపై ప్రత్యేక నిఘా వరద నీరు చేరే అవకాశం ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఇతర విద్యుత్ వ్యవస్థలను గుర్తించి ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలించిన వెంటనే సరఫరాను పునరుద్ధరించాలన్నారు. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, బలహీనమైన రహదారులు, డ్రైనేజీ అడ్డంకులను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. జలవనరుల శాఖ అధికారులు చెరువులు, రిజర్వాయర్లు, నదులు, కాలువలను పరిశీలించి గట్లకు ప్రమాదం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటి మట్టాలు, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రక్షణ బృందాలు, అత్యవసర సామగ్రి సిద్ధం ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం బోట్లు, లైఫ్ జాకెట్లు, డీవాటరింగ్ పంపులు, జనరేటర్లు, టార్చ్‌లైట్లు, తాళ్లు, టెంట్లు, టార్పాలిన్లు తదితర సామగ్రిని సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. అగ్నిమాపక శాఖ, సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలు అవసరమైన పరికరాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు రైతులకు వర్షాలపై ముందస్తు సమాచారం అందించి పంటలు, పశువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పొలాల్లో నీరు నిలిచిపోకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జీరో క్యాజువాలిటీ లక్ష్యంగా పనిచేయాలి తుఫాను అనంతరం ఇళ్లు, పంటలు, రహదారులు, ప్రభుత్వ ఆస్తులు, విద్యుత్, తాగునీటి వ్యవస్థలకు జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. బాధితులకు తక్షణ సహాయం అందించడం, పారిశుద్ధ్య పనులు చేపట్టడం, అత్యవసర సేవలను పునరుద్ధరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. చేపట్టిన ముందస్తు చర్యలు, అందుబాటులో ఉన్న వనరులు, పనుల పురోగతిపై రోజువారీ నివేదికలు సమర్పించాలని సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జీరో క్యాజువాలిటీ లక్ష్యంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 గుంటూరు • అమరావతి News
Reporter
PRAJAMUDRA
9 రోజుల క్రితం
Logo

పోలీసులను కారుతో ఢీకొట్టిన బీజేపీ అభ్యర్థిని తక్షణమే అరెస్టు చేయాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య

​ఎన్నికలలో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ ​శ్రీకాకుళం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఐ విజయవాడ, నవంబర్ 16: నామినేషన్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీసులను కారుతో ఢీకొట్టిన శ్రీకాకుళం 36వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి చల్లా వెంకటేశ్వరరావును తక్షణమే అరెస్టు చేసి, ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ​శ్రీకాకుళం 36వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన బీజేపీ నేత చల్లా...

ముఖ్యమైన పాయింట్స్:

  • ​ఎన్నికలలో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్
  • ​శ్రీకాకుళం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఐ
విజయవాడ, నవంబర్ 16: నామినేషన్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీసులను కారుతో ఢీకొట్టిన శ్రీకాకుళం 36వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి చల్లా వెంకటేశ్వరరావును తక్షణమే అరెస్టు చేసి, ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ​శ్రీకాకుళం 36వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన బీజేపీ నేత చల్లా వెంకటేశ్వరరావు (శ్రీకాకుళం మేయర్ అభ్యర్థి చల్లా గ్రీష్మ తండ్రి) ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారని ఈశ్వరయ్య మండిపడ్డారు. నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేయాల్సి ఉన్నప్పటికీ, తాను కారుతోనే లోపలికి వెళ్తానంటూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో అడ్డుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ మెట్ట సుధాకర్‌లను కారుతో దారుణంగా ఢీకొట్టడం అత్యంత అమానుషమని, గర్హనీయమని ఆయన తీవ్రంగా ఖండించారు. ​రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఒకవైపు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అధికార కూటమి ప్రభుత్వం బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాలకు గురిచేస్తోందని ఈశ్వరయ్య ఆరోపించారు. మరోవైపు అధికార కూటమి పార్టీల అనుయాయులు రౌడీలు, గూండాలవలె వ్యవహరిస్తూ ఏకంగా పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. ​పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన చల్లా వెంకటేశ్వరరావుపై తక్షణమే హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, అతని నామినేషన్‌ను తిరస్కరించి అనర్హుడిగా ప్రకటించాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని ఈశ్వరయ్య కోరారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 తూర్పు గోదావరి • Rajamandri News
Reporter
PRAJAMUDRA
9 రోజుల క్రితం
Logo

మొబైల్ టెక్నీషియన్లకు భరోసా.. డిజిటల్ సేవలకు ‘ఎంఎస్ఎం’ యాప్

మొబైల్ రిపేరింగ్ రంగంలో పారదర్శకత, భద్రతే లక్ష్యం రాజమహేంద్రవరం, ప్రజాముద్ర: మొబైల్ రిపేరింగ్ రంగంలో పనిచేస్తున్న టెక్నీషియన్ల భద్రతను బలోపేతం చేయడంతో పాటు, కస్టమర్లకు మరింత నమ్మకమైన సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ కొత్తగా ఎంఎస్ఎం డిజిటల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ వ్యాపార కార్యకలాపాలను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్ వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని మెగా కన్వెన్షన్ హాల్‌లో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. యాప్‌కు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి, దాని...

ముఖ్యమైన పాయింట్స్:

  • మొబైల్ రిపేరింగ్ రంగంలో పారదర్శకత, భద్రతే లక్ష్యం
రాజమహేంద్రవరం, ప్రజాముద్ర: మొబైల్ రిపేరింగ్ రంగంలో పనిచేస్తున్న టెక్నీషియన్ల భద్రతను బలోపేతం చేయడంతో పాటు, కస్టమర్లకు మరింత నమ్మకమైన సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ కొత్తగా ఎంఎస్ఎం డిజిటల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ వ్యాపార కార్యకలాపాలను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్ వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని మెగా కన్వెన్షన్ హాల్‌లో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. యాప్‌కు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి, దాని పనితీరు, వినియోగం, ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ మొబైల్ రిపేరింగ్ వృత్తిలో టెక్నీషియన్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు, వారి వృత్తిపరమైన భద్రతకు ఈ యాప్ దోహదపడుతుందని తెలిపారు. మొబైల్ రిపేరింగ్ వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని ఒకే డిజిటల్ వేదికపై నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. దీనివల్ల వ్యాపార నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతాయని పేర్కొన్నారు. కస్టమర్లు రిపేరింగ్ కోసం అందజేసే మొబైల్ ఫోన్ల వివరాలను యాప్‌లో నమోదు చేయడం ద్వారా సేవల నిర్వహణ మరింత క్రమబద్ధంగా ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. ముఖ్యంగా అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్న మొబైల్ ఫోన్ల గుర్తింపు, వాటి వినియోగాన్ని నిరోధించే దిశగా ఈ డిజిటల్ విధానం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ప్రాంత ఇన్‌చార్జి, వైస్ ప్రెసిడెంట్ కె. దామోదర్, కోస్తాంధ్ర ప్రాంత ఇన్‌చార్జి, జనరల్ సెక్రటరీ ఎన్. హేమసుందర్, రాజధాని ప్రాంత ఇన్‌చార్జి, వైస్ ప్రెసిడెంట్ ఎస్.కె. జానీ, రాయలసీమ ప్రాంత ఇన్‌చార్జి, వైస్ ప్రెసిడెంట్ ఎన్.ఎం. ప్రసాద్ పాల్గొన్నారు. అసోసియేషన్ సభ్యత్వం కలిగిన ప్రతి మొబైల్ టెక్నీషియన్ ఎంఎస్ఎం యాప్‌ను వినియోగించుకోవాలని ప్రతినిధులు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మొబైల్ రిపేరింగ్ రంగంలో భద్రత, నమ్మకం, పారదర్శకతను మరింత పెంపొందించేందుకు అందరూ సహకరించాలని కోరారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 గుంటూరు • Amaravathi News
Reporter
PRAJAMUDRA
9 రోజుల క్రితం
Logo

బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ముప్పు.. ఏపీకి భారీ వర్ష సూచన!

ఉత్తరాంధ్రకు గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు సాయంత్రానికి తుపానుగా.. రేపు తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక అమరావతి, నవంబర్ 16 (ప్రజాముద్ర): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఈ...

ముఖ్యమైన పాయింట్స్:

  • ఉత్తరాంధ్రకు గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • సాయంత్రానికి తుపానుగా.. రేపు తీవ్ర తుపానుగా బలపడే అవకాశం
  • ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
అమరావతి, నవంబర్ 16 (ప్రజాముద్ర): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం అండమాన్ దీవులకు 640 కిలోమీటర్లు, చెన్నైకు 760 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 870 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 980 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపానుగా బలపడే అవకాశం దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో సోమవారం సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత 48 గంటల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఈ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోమవారం సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, ముఖ్యంగా తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు వ్యవసాయ పనులు, పంటల రక్షణ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధికార యంత్రాంగం సూచనలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 శ్రీకాకుళం • Srikakulam News
Reporter
PRAJAMUDRA
10 రోజుల క్రితం
Logo

ధరల భారంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు: మాజీ మంత్రి ధర్మాన

శ్రీకాకుళం: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. ​2050 నాటికి రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామని, రూపాయికే భూములు ఇస్తూ పరిశ్రమలు తెస్తామని సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ధర్మాన ఆరోపించారు. నేడు రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు తమ సంపాదనతో కుటుంబ సభ్యుల కడుపు నింపలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ​ధరల పెరుగుదల (2024 vs ప్రస్తుతం): ​బియ్యం (సూపర్ ఫైన్): రూ....

శ్రీకాకుళం: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. ​2050 నాటికి రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామని, రూపాయికే భూములు ఇస్తూ పరిశ్రమలు తెస్తామని సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ధర్మాన ఆరోపించారు. నేడు రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు తమ సంపాదనతో కుటుంబ సభ్యుల కడుపు నింపలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ​ధరల పెరుగుదల (2024 vs ప్రస్తుతం): ​బియ్యం (సూపర్ ఫైన్): రూ. 50 నుండి రూ. 85కి; సాధారణ బియ్యం: రూ. 45 నుండి రూ. 75కి పెరిగాయి. ​పప్పులు: కందిపప్పు (రూ. 180), మినప్పప్పు (రూ. 160), పెసరపప్పు (రూ. 180) ధరలకు చేరాయి. ​ఇతర నిత్యావసరాలు: ఉల్లిపాయలు రూ. 20 నుండి రూ. 90కి, పామాయిల్ రూ. 90 నుండి రూ. 155కి, గ్యాస్ సిలిండర్ రూ. 855 నుండి రూ. 970కి, పెట్రోల్ రూ. 118కి పెరిగాయి. ​ఛార్జీలు & ఫీజులు: కరెంట్ ట్రూ-అప్ ఛార్జీల పేరుతో రూ. 20 వేల కోట్ల భారం వేశారని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ప్రైవేట్ స్కూల్/కాలేజీ ఫీజులు 40 శాతం పెరిగాయని తెలిపారు. ​ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసగించిన ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారానే తగిన బుద్ధి చెప్పాలని ధర్మాన ప్రజలకు పిలుపునిచ్చారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
10 రోజుల క్రితం
Logo

కార్మికులకు రక్షణ ఏది? పరిశ్రమల యజమానులకేనా ప్రభుత్వ భరోసా?

డిసెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: సీఐటీయూ పిలుపు అనకాపల్లి, నవంబర్ 15 (ప్రజాముద్ర): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల యజమానులకు ప్రాధాన్యత ఇస్తూ కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకరరావు విమర్శించారు. కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఐటీయూ అఖిలభారత కమిటీ పిలుపులో భాగంగా అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ గోడపత్రికను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం...

ముఖ్యమైన పాయింట్స్:

  • డిసెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: సీఐటీయూ పిలుపు
అనకాపల్లి, నవంబర్ 15 (ప్రజాముద్ర): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల యజమానులకు ప్రాధాన్యత ఇస్తూ కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకరరావు విమర్శించారు. కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఐటీయూ అఖిలభారత కమిటీ పిలుపులో భాగంగా అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ గోడపత్రికను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 12 ఏళ్లలో కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ఆరోపించారు. కార్మికులకు నష్టం కలిగిస్తూ యజమానులకు ప్రయోజనం చేకూర్చేలా నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని విమర్శించారు. స్కీమ్‌లలో పనిచేస్తున్న కార్మికులకు ఏళ్ల తరబడి వేతనాలు పెంచలేదని, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలకు సంబంధించి 15 ఏళ్లుగా జీవోలను సవరించలేదని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, దేశవ్యాప్తంగా లక్షలాది ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని అన్నారు. భవన నిర్మాణ, ముఠా, ఆటో, మోటార్ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు తగిన రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపదగా ఉన్న భూమి, అడవులు, నీటి వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. ఎస్ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను రద్దు చేశారని, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిశ్రమల యజమానులకు రక్షణ కల్పిస్తామని చెబుతోందని, అయితే అదే పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత, వేతనాల పెంపు, హక్కుల పరిరక్షణపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన సీఐఐ సదస్సులో కార్పొరేట్ సంస్థలకు ఘన స్వాగతం పలుకుతూ భూములు, వేల కోట్ల రూపాయల రాయితీలు కల్పిస్తున్నారని, అదే సమయంలో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాల పెంపును పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం డిసెంబర్ 1 నుంచి నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శంకరరావు కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి గనిశెట్టి సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యుడు కె. ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
10 రోజుల క్రితం
Logo

శాఖవీధి ప్రభుత్వ గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్‌కు ఘన నివాళి.. పుస్తక ప్రదర్శన ప్రారంభం అనకాపల్లి, నవంబర్ 15 (ప్రజా ముద్ర): అనకాపల్లి పట్టణంలోని శాఖవీధి ప్రభుత్వ గ్రేడ్-1 శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ అధికారి కె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్లా నాగభూషణం పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన...

ముఖ్యమైన పాయింట్స్:

  • గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్‌కు ఘన నివాళి.. పుస్తక ప్రదర్శన ప్రారంభం
అనకాపల్లి, నవంబర్ 15 (ప్రజా ముద్ర): అనకాపల్లి పట్టణంలోని శాఖవీధి ప్రభుత్వ గ్రేడ్-1 శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ అధికారి కె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్లా నాగభూషణం పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఈ ప్రభుత్వ గ్రేడ్-1 గ్రంథాలయంలో సుమారు 12 వేల పుస్తకాలు అందుబాటులో ఉండటం విశేషమన్నారు. పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర, విజ్ఞానశాస్త్రం, మహనీయుల జీవిత చరిత్రలు, దేశ నాయకుల గురించి తెలిపే పుస్తకాలతో పాటు బాలసాహిత్యం, సాంఘిక శాస్త్రాలు, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ గ్రంథాలయాలను సందర్శించాలని, పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని, మేధాశక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఎందరో మహనీయులు గ్రంథాలయాల ద్వారా విజ్ఞానాన్ని సంపాదించి సమాజానికి, దేశానికి సేవలందించారని గుర్తుచేశారు. పెద్దలు, విద్యార్థులు, చిన్నారులు గ్రంథాలయాలను సందర్శించి వాటి అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రంథాలయ అధికారి కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి కృషిచేసిన ప్రముఖుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి ఆశయాలను భావితరాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్లా నాగభూషణం, గ్రంథాలయ అధికారి కె. శ్రీనివాసరావు, న్యాయవాది బంధం దుర్గాప్రసాద్, విశ్రాంత గ్రంథాలయ అధికారి కొణతాల రామారావు, గ్రామ సచివాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • పరవాడ News
Reporter
PRAJAMUDRA
10 రోజుల క్రితం
Logo

రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు పరవాడ క్రీడాకారుడు పైల దుష్యంత్ ఎంపిక

అండర్-14 ఎపీ విభాగంలో విశాఖ జిల్లా తరఫున ప్రాతినిధ్యం పరవాడ, నవంబర్ 14: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు పరవాడకు చెందిన యువ క్రీడాకారుడు పైల దుష్యంత్ ఎంపికయ్యాడు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటుకుని రాష్ట్ర స్థాయి బరిలో నిలిచాడు. నవంబర్ 14న అనకాపల్లి మండలం మామిడిపాలెంలోని పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన విశాఖపట్నం జిల్లా స్థాయి ఫెన్సింగ్ ఎంపిక పోటీల్లో దుష్యంత్ ప్రతిభ కనబరిచాడు. దీంతో అండర్-14 బాలుర ఎపీ (Epee) విభాగంలో జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత...

ముఖ్యమైన పాయింట్స్:

  • అండర్-14 ఎపీ విభాగంలో విశాఖ జిల్లా తరఫున ప్రాతినిధ్యం
పరవాడ, నవంబర్ 14: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు పరవాడకు చెందిన యువ క్రీడాకారుడు పైల దుష్యంత్ ఎంపికయ్యాడు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటుకుని రాష్ట్ర స్థాయి బరిలో నిలిచాడు. నవంబర్ 14న అనకాపల్లి మండలం మామిడిపాలెంలోని పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన విశాఖపట్నం జిల్లా స్థాయి ఫెన్సింగ్ ఎంపిక పోటీల్లో దుష్యంత్ ప్రతిభ కనబరిచాడు. దీంతో అండర్-14 బాలుర ఎపీ (Epee) విభాగంలో జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 21, 22 తేదీల్లో కృష్ణా జిల్లా గన్నవరంలో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో దుష్యంత్ విశాఖపట్నం జిల్లా జట్టు తరఫున పాల్గొననున్నాడు. దుష్యంత్ ఎంపికపై ఐకాన్ స్పోర్ట్స్ హబ్ నిర్వాహకులు, కోచ్‌లు సంతోషం వ్యక్తం చేశారు. ఫెన్సింగ్ కోచ్ మొల్లి తులసీరావు మాట్లాడుతూ, శిక్షణ సమయంలో దుష్యంత్ క్రమశిక్షణ, ఏకాగ్రతతో పాటు పట్టుదలను ప్రదర్శిస్తున్నాడని తెలిపారు. నిరంతర సాధనతో జిల్లా స్థాయిలో ప్రతిభ నిరూపించుకుని రాష్ట్ర స్థాయికి చేరడం అభినందనీయమన్నారు. గన్నవరంలో జరిగే పోటీల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసి పతకం సాధించడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందాలని ఆకాంక్షించారు. స్థానిక యువ క్రీడాకారులకు దుష్యంత్ విజయం ప్రేరణగా నిలుస్తుందని ఐకాన్ స్పోర్ట్స్ హబ్ నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించి పరవాడ ప్రాంతానికి, విశాఖ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ దుష్యంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. – ప్రజా ముద్ర NEWS
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 గుంటూరు • Amaravathi News
Reporter
PRAJAMUDRA
11 రోజుల క్రితం
Logo

అమరావతికి రైల్వే కనెక్టివిటీ.. రాజధాని అభివృద్ధికి కొత్త దిశ!

58.1 కిలోమీటర్ల రైల్వే కారిడార్.. తాడికొండ వద్ద ప్రధాన స్టేషన్.. కొప్పురావూరులో భారీ రైల్వే టెర్మినల్ ప్రతిపాదన అమరావతి, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించే దిశగా రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టు ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు కొత్త రైల్వే మార్గం నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు రాజధాని ప్రాంతంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే అమరావతికి రైలు ప్రయాణ సౌకర్యాలు మరింత చేరువ కానున్నాయి. 58.1 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే మార్గం ఎర్రుపాలెం–నంబూరు మధ్య సుమారు 58.1 కిలోమీటర్ల పొడవుతో రైల్వే కారిడార్...

ముఖ్యమైన పాయింట్స్:

  • 58.1 కిలోమీటర్ల రైల్వే కారిడార్.. తాడికొండ వద్ద ప్రధాన స్టేషన్.. కొప్పురావూరులో భారీ రైల్వే టెర్మినల్ ప్రతిపాదన
అమరావతి, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించే దిశగా రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టు ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు కొత్త రైల్వే మార్గం నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు రాజధాని ప్రాంతంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే అమరావతికి రైలు ప్రయాణ సౌకర్యాలు మరింత చేరువ కానున్నాయి. 58.1 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే మార్గం ఎర్రుపాలెం–నంబూరు మధ్య సుమారు 58.1 కిలోమీటర్ల పొడవుతో రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మార్గంలో ఆధునిక రైల్వే సదుపాయాలతో పాటు గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా నిర్మాణ ప్రమాణాలను రూపొందించినట్లు సమాచారం. తాడికొండ సమీపంలో ప్రధాన స్టేషన్ రాజధాని ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా తాడికొండ సమీపంలో ప్రధాన రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని మౌలిక సదుపాయాల ప్రణాళికల్లో చోటుచేసుకున్న మార్పులకు అనుగుణంగా స్టేషన్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొప్పురావూరులో భారీ రైల్వే టెర్మినల్ ఈ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన అంశం కొప్పురావూరు ప్రాంతంలో ప్రతిపాదించిన మెగా రైల్వే టెర్మినల్. సుమారు 230 ఎకరాల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ప్రతిపాదిత టెర్మినల్‌లో తొమ్మిది ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు, ఆరు పిట్ లైన్లు, 12 స్టేబ్లింగ్ లైన్లతో పాటు రైళ్ల నిర్వహణ, మరమ్మతులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని భావిస్తున్నారు. కృష్ణా నదిపై భారీ వంతెన రైల్వే కారిడార్ నిర్మాణంలో కృష్ణా నదిపై సుమారు 4.5 కిలోమీటర్ల పొడవైన వంతెన కీలక భాగంగా ఉండనుంది. దీనితో పాటు ప్రధాన, చిన్న వంతెనలు, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి కూడా ప్రణాళికలు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తొమ్మిది ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు ప్రతిపాదిత రైల్వే మార్గంలో పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపల్లి, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ల ఏర్పాటును ప్రణాళికలో చేర్చినట్లు సమాచారం. రూ.2,047 కోట్లతో ప్రాజెక్టు ఈ రైల్వే కారిడార్‌కు సుమారు రూ.2,047 కోట్ల వ్యయం అంచనా వేసినట్లు వార్తా నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రాజెక్టును వివిధ నిర్మాణ ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని విభాగాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా ప్రస్తావనకు వచ్చింది. రాజధాని ప్రాంతానికి రవాణా పరంగా ప్రయోజనం అమరావతికి నేరుగా రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తే రాజధాని ప్రాంత ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయి. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు రైలు ప్రయాణం మరింత సులభమయ్యే అవకాశం ఉంది. అలాగే రాజధాని ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధికి రవాణా సదుపాయాలు అదనపు బలాన్ని అందించనున్నాయి. అమరావతి అభివృద్ధిలో రైల్వే కనెక్టివిటీ కీలక పాత్ర పోషించనుండటంతో ఈ ప్రాజెక్టు పురోగతిపై రాజధాని ప్రాంత ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రజా ముద్ర NEWS – ప్రజల పక్షాన.. ప్రజా సమస్యలపై నిరంతర వార్తా ప్రసారం.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 గుంటూరు • Amaravathi News
Reporter
PRAJAMUDRA
11 రోజుల క్రితం
Logo

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ముఖ్య సమాచారం.. ఖర్చు పరిమితులు, డిపాజిట్ వివరాలు ఇవే!

అనకాపల్లి, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎన్నికల వ్యయ పరిమితులు, నామినేషన్ సమయంలో చెల్లించాల్సిన ధరావతు మొత్తాల వివరాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2026 అక్టోబర్ 10న నోటిఫికేషన్ నంబర్లు 566/SEC-B1/2026, 567/SEC-B1/2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి: - 10 వేలలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.2.50 లక్షలు. - 10 వేల లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.4 లక్షలు. వార్డు...

అనకాపల్లి, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎన్నికల వ్యయ పరిమితులు, నామినేషన్ సమయంలో చెల్లించాల్సిన ధరావతు మొత్తాల వివరాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2026 అక్టోబర్ 10న నోటిఫికేషన్ నంబర్లు 566/SEC-B1/2026, 567/SEC-B1/2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి: - 10 వేలలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.2.50 లక్షలు. - 10 వేల లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.4 లక్షలు. వార్డు సభ్యుల ఎన్నికల వ్యయ పరిమితి: - 10 వేలలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.60 వేలు. - 10 వేల లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.1 లక్ష. నామినేషన్ ధరావతు (డిపాజిట్) వివరాలు: అభ్యర్థి కేటగిరీ| జనరల్| ఎస్సీ, ఎస్టీ, బీసీ వార్డు సభ్యుడు| రూ.1,000| రూ.500 సర్పంచ్| రూ.3,000| రూ.1,500 ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో తమకు వర్తించే ధరావతు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన వ్యయ పరిమితులను తప్పనిసరిగా పాటించాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియకు ముందుగానే ఈ వివరాలను తెలుసుకుని, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ప్రజా ముద్ర NEWS
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 విశాఖపట్నం • Anakapalli News
Reporter
PRAJAMUDRA
11 రోజుల క్రితం
Logo

ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు భారీ ప్రోత్సాహకాలు.. గరిష్ఠంగా రూ.50 లక్షలు!

అనకాపల్లి, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లో 2026 గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీఓ ఆర్‌టీ నంబర్ 1111, తేదీ 13-11-2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటించింది. జనాభా ఆధారంగా ప్రోత్సాహకాలు ఇలా.. - 5,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షలు. - 5,001 నుంచి 10,000 వరకు జనాభా...

అనకాపల్లి, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లో 2026 గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీఓ ఆర్‌టీ నంబర్ 1111, తేదీ 13-11-2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటించింది. జనాభా ఆధారంగా ప్రోత్సాహకాలు ఇలా.. - 5,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షలు. - 5,001 నుంచి 10,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు. - 10,000కు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షలు. అయితే ఈ ప్రోత్సాహకం పొందాలంటే కేవలం సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కావడం సరిపోదు. గ్రామ పంచాయతీలోని సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. సంబంధిత ఎన్నికల అధికారులు ఏకగ్రీవ ఎన్నికలను అధికారికంగా ప్రకటించి, అర్హతను నిర్ధారించిన తర్వాత నిధుల విడుదల చేపడతారు. ఈ నిధులను గ్రామాల్లో ఆమోదం పొందిన అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే వినియోగించాల్సి ఉంటుంది. నిధులను విడతలవారీగా విడుదల చేయనుండగా, ఈ ప్రోత్సాహక పథకం 2026 సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రజా ముద్ర NEWS
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 గుంటూరు • Amaravathi News
Reporter
PRAJAMUDRA
11 రోజుల క్రితం
Logo

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల

అమరావతి, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తొలి విడత నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2026 నవంబర్ 13వ తేదీన నోటిఫికేషన్ నంబర్ 1800/SEC-B2/2026 ద్వారా ఈ ప్రకటన వెలువడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఫేజ్‌–1లో భాగంగా ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పంచాయతీలకు రెండో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఓటు హక్కు కలిగిన నమోదిత ఓటర్లు తమ గ్రామ సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులను ఎన్నుకోనున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-K, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994లోని సంబంధిత...

అమరావతి, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తొలి విడత నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2026 నవంబర్ 13వ తేదీన నోటిఫికేషన్ నంబర్ 1800/SEC-B2/2026 ద్వారా ఈ ప్రకటన వెలువడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఫేజ్‌–1లో భాగంగా ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పంచాయతీలకు రెండో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఓటు హక్కు కలిగిన నమోదిత ఓటర్లు తమ గ్రామ సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులను ఎన్నుకోనున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-K, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994లోని సంబంధిత నిబంధనల ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తొలి విడత ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను నోటిఫికేషన్‌కు జతచేసిన అనుబంధం–1లో పొందుపరిచారు. అదేవిధంగా తొలి విడతలో ఎన్నికలు నిర్వహించే మండలాల వివరాలను అనుబంధం–2లో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సందడి మొదలయ్యే అవకాశం ఉంది. — ప్రజా ముద్ర NEWS
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
11 రోజుల క్రితం
Logo

మధుమేహంపై ముందస్తు చర్యలతో వ్యాధి నియంత్రణ సాధ్యం

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా అనకాపల్లిలో అవగాహన కార్యక్రమం – రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని వైద్యుల సూచన అనకాపల్లి, నవంబర్ 14: మధుమేహ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించి, వ్యాధిని ముందస్తుగా గుర్తించి నియంత్రించాలనే లక్ష్యంతో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మధుమేహ వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స, వ్యాధి కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ఏడాది ప్రపంచ మధుమేహ...

ముఖ్యమైన పాయింట్స్:

  • ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా అనకాపల్లిలో అవగాహన కార్యక్రమం – రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని వైద్యుల సూచన
అనకాపల్లి, నవంబర్ 14: మధుమేహ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించి, వ్యాధిని ముందస్తుగా గుర్తించి నియంత్రించాలనే లక్ష్యంతో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మధుమేహ వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స, వ్యాధి కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ఏడాది ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని “మధుమేహంపై ముందస్తు చర్యలు (Early Action on Diabetes)” అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధుమేహాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్. అచ్యుతకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని సూచించారు. అధిక బరువును నియంత్రించుకోవడంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయాలని తెలిపారు. మధుమేహ లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించాలని సూచించారు. జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా గుండె, మూత్రపిండాలు, కంటి సంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్‌సీడీ విభాగం సిబ్బందికి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సిబ్బందికి మధుమేహ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులు వాడాలని, రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని సూచించారు. వైద్యుల సలహాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, డిపిహెచ్‌ఎన్ డాక్టర్ కృష్ణసారావు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎస్. రాజి, డాక్టర్ వినోద్, డాక్టర్ వెంకటేష్, ఇతర అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. – ప్రజా ముద్ర NEWS, అనకాపల్లి
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Ummalada News
Reporter
PRAJAMUDRA
11 రోజుల క్రితం
Logo

నెల రోజుల చిన్నారికి ప్రపంచ రికార్డు గుర్తింపు

పుట్టుకతోనే 6 నుంచి 7 సెంటీమీటర్ల పొడవైన ఒత్తైన జుట్టు.. ఉమ్మలాడ గ్రామానికి గర్వకారణంగా యాసిక శ్రీ అనకాపల్లి: సాధారణంగా చిన్నారులు పుట్టినప్పుడు తక్కువ జుట్టుతో కనిపిస్తారు. అయితే అనకాపల్లి జిల్లాకు చెందిన నెల రోజుల పసికందు పుట్టుకతోనే పొడవైన, ఒత్తైన జుట్టుతో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా తన ప్రత్యేకతతో ప్రపంచ రికార్డు గుర్తింపును సైతం అందుకుని వార్తల్లో నిలిచింది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామానికి చెందిన యాసిక శ్రీ అనే చిన్నారి ఈ అరుదైన గుర్తింపును సాధించింది. సెప్టెంబర్ నెలలో అనకాపల్లి పట్టణంలోని ఘోషా ఆసుపత్రిలో జన్మించిన ఈ పాపకు...

ముఖ్యమైన పాయింట్స్:

  • పుట్టుకతోనే 6 నుంచి 7 సెంటీమీటర్ల పొడవైన ఒత్తైన జుట్టు.. ఉమ్మలాడ గ్రామానికి గర్వకారణంగా యాసిక శ్రీ
అనకాపల్లి: సాధారణంగా చిన్నారులు పుట్టినప్పుడు తక్కువ జుట్టుతో కనిపిస్తారు. అయితే అనకాపల్లి జిల్లాకు చెందిన నెల రోజుల పసికందు పుట్టుకతోనే పొడవైన, ఒత్తైన జుట్టుతో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా తన ప్రత్యేకతతో ప్రపంచ రికార్డు గుర్తింపును సైతం అందుకుని వార్తల్లో నిలిచింది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామానికి చెందిన యాసిక శ్రీ అనే చిన్నారి ఈ అరుదైన గుర్తింపును సాధించింది. సెప్టెంబర్ నెలలో అనకాపల్లి పట్టణంలోని ఘోషా ఆసుపత్రిలో జన్మించిన ఈ పాపకు పుట్టుకతోనే సుమారు 6 నుంచి 7 సెంటీమీటర్ల పొడవైన ఒత్తైన జుట్టు ఉండటం విశేషం. చిన్నారి ప్రత్యేకతను గుర్తించిన తల్లిదండ్రులు ప్రపంచ రికార్డుల సంస్థను సంప్రదించారు. అనంతరం సంబంధిత ప్రతినిధులు పాపకు సంబంధించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు, జుట్టు పొడవును పరిశీలించి 'వన్ మంత్ బేబీ' విభాగంలో రికార్డు నమోదును ధ్రువీకరించారు. ఈ మేరకు చిన్నారికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. తమ ఇంట పుట్టిన ఆడబిడ్డ నెల రోజుల వయసులోనే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి ఈ గుర్తింపు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆడపిల్ల పుట్టడాన్ని భారంగా భావించే ఆలోచనలకు భిన్నంగా, తమ కుమార్తె పుట్టుకతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో యాసిక శ్రీ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. ఈ చిన్నారి అరుదైన ప్రత్యేకత ఉమ్మలాడ గ్రామంతో పాటు అనకాపల్లి జిల్లాలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రజా ముద్ర NEWS | అనకాపల్లి
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
11 రోజుల క్రితం
Logo

అనకాపల్లి నిదానం దొడ్డిలో శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలకు శ్రీకారం

తొలి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాడి రత్నాకర్, మళ్ల సురేంద్ర అనకాపల్లి: అనకాపల్లి నిదానం దొడ్డిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. నవంబర్ 23, 2026న నిర్వహించనున్న జయంతి వేడుకలను పురస్కరించుకుని పది రోజులపాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు శ్రీ సత్యసాయి బాబా వారి పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మాజీ అధ్యక్షుడు దాడి రత్నాకర్, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర హాజరయ్యారు. ఈ...

ముఖ్యమైన పాయింట్స్:

  • తొలి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాడి రత్నాకర్, మళ్ల సురేంద్ర
అనకాపల్లి: అనకాపల్లి నిదానం దొడ్డిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. నవంబర్ 23, 2026న నిర్వహించనున్న జయంతి వేడుకలను పురస్కరించుకుని పది రోజులపాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు శ్రీ సత్యసాయి బాబా వారి పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మాజీ అధ్యక్షుడు దాడి రత్నాకర్, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైన ఈ పది రోజుల వేడుకల్లో భక్తులు, స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జయంతి ఉత్సవాల సందర్భంగా రానున్న రోజుల్లోనూ పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 విశాఖపట్నం • Vizag News
Reporter
PRAJAMUDRA
11 రోజుల క్రితం
Logo

అంతర్జాతీయ వేదికపై ఏటికొప్పాక కళాకృతులకు విశేష గుర్తింపు

CII భాగస్వామ్య సదస్సులో ఏటికొప్పాక స్టాల్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం అనకాపల్లి, నవంబర్ 13: ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ CII భాగస్వామ్య సదస్సు–2026లో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక కళాకృతుల ప్రదర్శన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి...

ముఖ్యమైన పాయింట్స్:

  • CII భాగస్వామ్య సదస్సులో ఏటికొప్పాక స్టాల్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం
అనకాపల్లి, నవంబర్ 13: ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ CII భాగస్వామ్య సదస్సు–2026లో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక కళాకృతుల ప్రదర్శన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితర ప్రముఖులు ఈ స్టాల్‌ను సందర్శించారు. అలాగే CII డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా కూడా ఏటికొప్పాక కళాకృతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏటికొప్పాకకు చెందిన సంప్రదాయ బొమ్మలు, హస్తకళా ఉత్పత్తుల ప్రత్యేకతలను స్టాల్ నిర్వాహకులు ప్రముఖులకు వివరించారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళారూపం తయారీ విధానం, దాని వెనుక ఉన్న సంప్రదాయం, ప్రత్యేకతలను తెలియజేశారు. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో ఏటికొప్పాక కళాకృతులకు ప్రదర్శన అవకాశం లభించడం స్థానిక హస్తకళాకారులకు ప్రోత్సాహకరంగా నిలుస్తోంది. ఇలాంటి వేదికల ద్వారా ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళలకు దేశవిదేశాల్లో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది. – ప్రజా ముద్ర NEWS
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 విశాఖపట్నం • Vizag News
Reporter
PRAJAMUDRA
13 రోజుల క్రితం
Logo

ఏపీలో పెట్టుబడిదారులకు చట్టపరమైన భరోసా.. ప్రత్యేక చట్టం దిశగా చంద్రబాబు ప్రభుత్వం!

ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక ఒప్పందాలకు రక్షణ.. ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను మరింతగా ఆకర్షించడంతో పాటు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వాలు ఇచ్చే హామీలకు చట్టబద్ధమైన భద్రత కల్పించేలా ప్రత్యేకంగా ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న 31వ CII భాగస్వామ్య సదస్సులో మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ గతంలో పరిశ్రమలకు ఇచ్చిన హామీలు, ఒప్పందాలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నదే...

ముఖ్యమైన పాయింట్స్:

  • ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక ఒప్పందాలకు రక్షణ.. ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను మరింతగా ఆకర్షించడంతో పాటు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వాలు ఇచ్చే హామీలకు చట్టబద్ధమైన భద్రత కల్పించేలా ప్రత్యేకంగా ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న 31వ CII భాగస్వామ్య సదస్సులో మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ గతంలో పరిశ్రమలకు ఇచ్చిన హామీలు, ఒప్పందాలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నదే ఈ ఆలోచన వెనుక ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. పెట్టుబడుల ఒప్పందాలకు భద్రత పారిశ్రామిక సంస్థలు ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ముందు అక్కడి ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక వాతావరణం, భవిష్యత్తులో లభించే ప్రోత్సాహకాలను పరిశీలిస్తాయి. అయితే రాజకీయ మార్పుల కారణంగా విధానాల్లో అనిశ్చితి ఏర్పడితే పెట్టుబడిదారులు వెనుకడుగు వేసే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు ఇచ్చిన హామీలను తదుపరి ప్రభుత్వాలు కూడా గౌరవించేలా చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సహకారాన్ని కూడా కోరినట్లు సమాచారం. ప్రోత్సాహకాల చెల్లింపులకు ప్రత్యేక విధానం పరిశ్రమలకు ప్రకటించే ప్రభుత్వ రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు సకాలంలో అందించడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం ఎస్క్రో ఖాతా విధానాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ప్రభుత్వం నుంచి పరిశ్రమలకు అందాల్సిన ప్రోత్సాహకాలకు అవసరమైన నిధులను ప్రత్యేక ఖాతాలో కేటాయించి, నిర్ణీత విధానం ప్రకారం చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నది ఈ విధానం లక్ష్యం. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే యోచన పెట్టుబడిదారుల రక్షణకు సంబంధించిన చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు మరింత భరోసా కలిగే అవకాశం ఉంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా పెట్టుబడులకు స్థిరమైన విధానపరమైన రక్షణ కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. భారీ పెట్టుబడులే లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్లు వంటి రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రతిపాదిత పెట్టుబడిదారుల రక్షణ చట్టం అమల్లోకి వస్తే పారిశ్రామిక రంగంలో విశ్వాసం పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. గమనిక: ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉంది. చట్టంలోని పూర్తి నిబంధనలు, అమలు విధానం, అసెంబ్లీ ఆమోదం వంటి అంశాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. – ప్రజా ముద్ర NEWS, విశాఖపట్నం
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 విశాఖపట్నం • Vizag News
Reporter
PRAJAMUDRA
13 రోజుల క్రితం
Logo

పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌ల పేరుతో ప్రచార ఆర్భాటం.. ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ విమర్శలు

ఎంఓయూల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపై సమాధానం చెప్పాలి.. విశాఖ భూ కేటాయింపులపై తీవ్ర ఆరోపణలు విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌లు అభివృద్ధి కంటే ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల ప్రకటనలు, ఉద్యోగాల హామీలు, విశాఖలో భూ కేటాయింపులపై పలు ప్రశ్నలు సంధించారు. ఎంఓయూల అమలుపై శ్వేతపత్రం ఎక్కడ? పెట్టుబడుల పేరుతో లక్షల కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలు...

ముఖ్యమైన పాయింట్స్:

  • ఎంఓయూల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపై సమాధానం చెప్పాలి.. విశాఖ భూ కేటాయింపులపై తీవ్ర ఆరోపణలు
విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌లు అభివృద్ధి కంటే ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల ప్రకటనలు, ఉద్యోగాల హామీలు, విశాఖలో భూ కేటాయింపులపై పలు ప్రశ్నలు సంధించారు. ఎంఓయూల అమలుపై శ్వేతపత్రం ఎక్కడ? పెట్టుబడుల పేరుతో లక్షల కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తోందని, అయితే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో వాస్తవంగా ఎన్ని పరిశ్రమలుగా రూపుదిద్దుకున్నాయి? ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి? అనే వివరాలను ప్రజలకు వెల్లడించాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. 2014-19 మధ్య, అలాగే 2025 నవంబర్‌లో చేసుకున్న ఎంఓయూల అమలు పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ, నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అమలు గురించి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన కోరారు. పెట్టుబడుల ప్రకటనలతో పాటు యువతకు కల్పించిన ఉద్యోగాల వివరాలను కూడా వెల్లడించాలన్నారు. గత ప్రభుత్వ ప్రాజెక్టులపై ప్రస్తావన రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులతో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పునాదులు పడ్డాయని, ప్రాజెక్టుల పనులు ముందుకు సాగాయని అమర్నాథ్ పేర్కొన్నారు. పారిశ్రామిక కారిడార్లు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం సాధించిన స్థానం వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. విశాఖ భూముల కేటాయింపులపై ఆరోపణలు విశాఖపట్నంలో సుమారు రూ.30 వేల కోట్ల విలువైన 3,000 ఎకరాలకు పైగా భూములను ఎకరాకు 99 పైసలకే కేటాయించారంటూ అమర్నాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. సరైన ఉనికి లేని కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కేటాయించారని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేటాయింపులను దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత ప్రభుత్వ శాఖల వివరణ వెలువడాల్సి ఉంది. సోషల్ మీడియా ప్రచారానికే ప్రాధాన్యతా? రాష్ట్రంలో వాస్తవ అభివృద్ధి, ప్రజలకు అందాల్సిన ప్రయోజనాల కంటే సోషల్ మీడియా ప్రచారానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అమర్నాథ్ విమర్శించారు. ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను వాస్తవ పరిస్థితుల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పార్ట్నర్‌షిప్ సమ్మిట్ ముగిసిన అనంతరం ప్రభుత్వం ప్రకటించే పెట్టుబడులు, ఒప్పందాలు, వాటి అమలు తీరుపై వాస్తవాలను ప్రజల ముందుంచుతామని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. గమనిక: ఈ కథనంలోని రాజకీయ విమర్శలు, భూ కేటాయింపులకు సంబంధించిన అంశాలు గుడివాడ అమర్నాథ్ చేసిన ఆరోపణలు, వ్యాఖ్యల ఆధారంగా రూపొందించబడ్డాయి.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
13 రోజుల క్రితం
Logo

అనకాపల్లిలో ఇంటి దొంగతనం కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్

బీరువా తాళం పగులగొట్టి బంగారు ఆభరణాల చోరీ.. 45.190 గ్రాముల బంగారం స్వాధీనం అనకాపల్లి, నవంబర్ 12: అనకాపల్లి పట్టణంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును టౌన్ పోలీసులు ఛేదించారు. బీరువా తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు అపహరించిన కేసులో ఓ యువకుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 45.190 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు మార్గదర్శకత్వంలో, సీఐ జి. ప్రేమ్ కుమార్ పర్యవేక్షణలో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. బీరువా తాళం...

ముఖ్యమైన పాయింట్స్:

  • బీరువా తాళం పగులగొట్టి బంగారు ఆభరణాల చోరీ.. 45.190 గ్రాముల బంగారం స్వాధీనం
అనకాపల్లి, నవంబర్ 12: అనకాపల్లి పట్టణంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును టౌన్ పోలీసులు ఛేదించారు. బీరువా తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు అపహరించిన కేసులో ఓ యువకుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 45.190 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు మార్గదర్శకత్వంలో, సీఐ జి. ప్రేమ్ కుమార్ పర్యవేక్షణలో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. బీరువా తాళం పగులగొట్టి చోరీ అనకాపల్లి పట్టణంలోని గాంధీనగరం ప్రాంతానికి చెందిన మెల్లిపాక ప్రమీల ఇంట్లో గత ఆగస్టు నెలలో గుర్తుతెలియని వ్యక్తి బీరువా తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలను దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 161/2026, సెక్షన్ 305(a) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే గేట్ సమీపంలో నిందితుడి అరెస్ట్ దర్యాప్తులో భాగంగా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా అనకాపల్లి టౌన్ ఎస్‌ఐ ఎ. వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి నవంబర్ 12న మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పట్టణంలోని సిటీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా, లక్ష్మీదేవిపేట రైల్వే గేట్ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తిని పోణకర్లపల్లి నాగేంద్రకుమార్ (25)గా పోలీసులు గుర్తించారు. ఇతను గుల్లిపల్లి గ్రామం, కె.కోటపాడు మండలానికి చెందిన వ్యక్తి కాగా, ప్రస్తుతం అనకాపల్లిలోని అంజయ్య కాలనీ, గాంధీనగరంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. 45.190 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం నిందితుడి వద్ద నుంచి పోలీసులు మొత్తం 45.190 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 1. బంగారు నల్లపూసల తాడు – 24.840 గ్రాములు 2. బంగారు నెక్లెస్ – 8.500 గ్రాములు 3. బంగారు చైనుతో కూడిన లాకెట్ – 6.420 గ్రాములు 4. బంగారు బ్రాస్లెట్ – 3.140 గ్రాములు 5. బంగారు ఉంగరం – 2.290 గ్రాములు కేసు ఛేదించిన పోలీసు సిబ్బందికి అభినందనలు నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్న అనంతరం పోలీసులు చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఈ కేసు ఛేదనలో ఎస్‌ఐ ఎ. వెంకటేశ్వరరావుతో పాటు కానిస్టేబుళ్లు పీసీ-2178 ఎం. సముద్రం, పీసీ-2291 ఆర్.పి. నాయుడు, పీసీ-2342 టి.ఎస్. నాయుడు పాల్గొన్నారు. కేసును ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. – ప్రజా ముద్ర NEWS | అనకాపల్లి జిల్లా
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 విశాఖపట్నం • Vizag News
Reporter
PRAJAMUDRA
13 రోజుల క్రితం
Logo

విశాఖలో ఘనంగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం

58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధుల హాజరు – వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలే ప్రధాన అజెండా విశాఖపట్నం: విశాఖ నగరంలో 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు–2026 ఘనంగా ప్రారంభమైంది. ‘నేవిగేటింగ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్’ (Navigating the New World Order) అనే ఇతివృత్తంతో భారత పరిశ్రమల సమాఖ్య ఈ సదస్సును నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంయుక్తంగా సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఐటీ...

ముఖ్యమైన పాయింట్స్:

  • 58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధుల హాజరు – వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలే ప్రధాన అజెండా
విశాఖపట్నం: విశాఖ నగరంలో 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు–2026 ఘనంగా ప్రారంభమైంది. ‘నేవిగేటింగ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్’ (Navigating the New World Order) అనే ఇతివృత్తంతో భారత పరిశ్రమల సమాఖ్య ఈ సదస్సును నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంయుక్తంగా సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు, కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగ్ లీ, సుచిత్రా ఎల్లా, సీఐఐ అధ్యక్షుడు, టాటా కెమికల్స్ సీఈఓ ఆర్. ముకుందన్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు 58 దేశాలకు చెందిన ప్రభుత్వ, పారిశ్రామిక రంగ ప్రతినిధులతో పాటు భారత్‌లోని వివిధ దేశాల రాయబారులు తరలివచ్చారు. అంతర్జాతీయ పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలు, సాంకేతిక అభివృద్ధిపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి. భారత్‌లో ఇండియా ఏఐ మిషన్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలతో ఉత్పాదకత, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత పెరుగుతోందని సీఐఐ అధ్యక్షుడు ఆర్. ముకుందన్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతిక రంగాల్లో వివిధ దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సోలార్ ప్యానెళ్ల తయారీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వంటి రంగాల్లో భారత్ కీలక పాత్ర పోషించాలని సదస్సు వేదికగా పిలుపునిచ్చారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలను (అగ్రి వ్యాల్యూ చైన్స్) విస్తృతంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆహార భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని వెల్లడించారు. పారిశ్రామిక పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, వ్యవసాయ రంగ అభివృద్ధి సమన్వయంతోనే వికసిత్ భారత్–2047, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాధించగలమని సీఐఐ ప్రతినిధులు స్పష్టం చేశారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 విశాఖపట్నం • Vizag News
Reporter
PRAJAMUDRA
13 రోజుల క్రితం
Logo

ఏపీలో రెన్యూ సంస్థ ప్రాజెక్టుల విస్తరణపై సీఎం చంద్రబాబుతో సుమంత్ సిన్హా భేటీ

విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రెన్యూ (ReNew) సంస్థ ఛైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హా తన ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో రెన్యూ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టుల విస్తరణకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, రెన్యూ సంస్థ ప్రాజెక్టుల విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు, ప్రముఖ సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రెన్యూ సంస్థ ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యత...

విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రెన్యూ (ReNew) సంస్థ ఛైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హా తన ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో రెన్యూ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టుల విస్తరణకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, రెన్యూ సంస్థ ప్రాజెక్టుల విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు, ప్రముఖ సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రెన్యూ సంస్థ ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజా ముద్ర | విశాఖపట్నం
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి

ప్రధాన కేటగిరీలు (Categories)

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు (26)

తెలంగాణ జిల్లాలు (33)