Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

అనకాపల్లి మండల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వండి

Author
Posted By PRAJAMUDRA
| 30 Oct 2026, 03:32 PM | ఆంధ్రప్రదేశ్
అనకాపల్లి మండల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వండి

  • అనకాపల్లి మండల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వండి
  • ​బీఎస్పీ జడ్పీటీసీ అభ్యర్థి సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తి
  • ​కొత్తూరు గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం, కరపత్రాల పంపిణీ

అనకాపల్లి:(ప్రజాముద్ర) మండల సమగ్ర అభివృద్ధికి, స్థానిక సమస్యల శాశ్వత పరిష్కారానికి జడ్పీటీసీగా తనకు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) బలపరిచిన అభ్యర్థి సూదికొండ మాణిక్యాలరావు ప్రజలను కోరారు.
​మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఈ ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
​ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

అనకాపల్లి మండల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వండి - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: