Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

రీపోలింగ్ అవసరం లేదు: కలెక్టర్ విజయ కృష్ణన్

Author
Posted By PRAJAMUDRA
| 01 Nov 2026, 10:03 PM | Array
రీపోలింగ్ అవసరం లేదు: కలెక్టర్ విజయ కృష్ణన్

అనకాపల్లి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్
​ఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేవు.. రీపోలింగ్ అవసరం లేదు: కలెక్టర్ విజయ కృష్ణన్
​అనకాపల్లి, నవంబర్ 1:
అనకాపల్లి జిల్లా పరిధిలోని నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీలతో పాటు జీవీఎంసీ వార్డుల ఎన్నికల పోలింగ్ ఆదివారం అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, జిల్లాలో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
​రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉదయం 7:00 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5:00 గంటల వరకు నిరంతరాయంగా సాగింది. సాయంత్రం 5:00 గంటల సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
​ప్రాంతాల వారీగా పోలింగ్ సరళి:
​ఎలమంచిలి మున్సిపాలిటీ (76.61%):
ఎలమంచిలి పరిధిలోని 63 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 36,526 మంది ఓటర్లకు (పురుషులు 17,450, మహిళలు 19,068, ఇతరులు 8) గాను 27,981 మంది (పురుషులు 13,093, మహిళలు 14,885, ఇతరులు 3) ఓటు హక్కు వినియోగించుకున్నారు.
​నర్సీపట్నం మున్సిపాలిటీ (72.50%):
నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన 76 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ తీర్పును వెల్లడించారు. మొత్తం 49,099 మంది ఓటర్లలో (పురుషులు 23,317, మహిళలు 25,778, ఇతరులు 4) 35,597 మంది (పురుషులు 16,909, మహిళలు 18,688) ఓటు వేశారు.
​జీవీఎంసీ వార్డులు (65.53%):
జిల్లా పరిధిలోకి వచ్చే జీవీఎంసీ వార్డుల్లో 89 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 76,950 మంది ఓటర్లకు (పురుషులు 37,079, మహిళలు 39,869, ఇతరులు 2) గాను 50,425 మంది (పురుషులు 23,746, మహిళలు 26,678, ఇతరులు 1) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
​ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది, బందోబస్తు నిర్వహించిన పోలీసు యంత్రాంగం సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించడంతో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని జిల్లా అధికార యంత్రాంగం వెల్లడించింది.


*జిల్లాలో ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ పత్రికా ముఖంగా తెలియజేశారు.

*జిల్లాలో మున్సిపల్ మరియు ఎలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీలలో ఎన్నికలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (SP)తుహిన్ సిన్హా తో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా నిర్వహించబడిన తీరును వివరించారు. పోలింగ్ నిర్వహణకు చేసిన ఏర్పాట్లు, ఎన్నికల సందర్భంగా చేపట్టిన భద్రతా చర్యలు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ మరియు ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినందుకు అభినందించారు. జిల్లాలో ఎక్కడ రీపోలింగ్ అవకాశం లేదని, జిల్లా వ్యాప్తంగా అధికారులు ధృవీకరించిన నివేదికల ప్రకారం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

*అదేవిధంగా, ఎన్నికల నిర్వహణకు సహకరించిన ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు మరియు ఇతర భాగస్వాములందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: