Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి విజయం

Author
Posted By PRAJAMUDRA
| 03 Nov 2026, 08:33 PM | Array
నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి విజయం

  • నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి విజయం
  • 11,519 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. ఎన్నికల ధ్రువీకరణ పత్రం అందజేత

అనకాపల్లి, నవంబర్ 3 (ప్రజాముద్ర): నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల పద్మావతి విజయం సాధించారు. మొత్తం 35,765 ఓట్లు పోలవగా, పద్మావతికి 23,028 ఓట్లు లభించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకాయల అనితకు 11,573 ఓట్లు వచ్చాయి.

స్వతంత్ర అభ్యర్థి బైపురెడ్డి చిట్టి శివ సంధ్యారాణికి 191 ఓట్లు పోలయ్యాయి. వీటితో పాటు 573 ఓట్లు చెల్లనివిగా నమోదవగా, 400 ఓట్లు నోటాకు పడ్డాయి.

ఇవి కూడా చదవండి

దీంతో చింతకాయల పద్మావతి 11,519 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి వి.వి.రమణ ఆమెకు ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: