Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

మూడు విడతల సర్పంచ్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Author
Posted By PRAJAMUDRA
| 10 Nov 2026, 08:10 PM | Array
మూడు విడతల సర్పంచ్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

  • ఎన్నికల నిర్వహణలో సమన్వయంతో పనిచేయాలి.. అధికారులకు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాలు

అనకాపల్లి, నవంబర్ 10: జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు విడతలుగా జరగనున్న ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం మధ్యాహ్నం వెబెక్స్ వేదికగా వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఆమె సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు, ఎక్కడైనా ఉల్లంఘనలు చోటుచేసుకుంటే తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని తెలిపారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ద్వారా ఓటరు స్లిప్పులు ప్రతి ఓటరుకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు

పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ వంటి కనీస సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వసతులు కల్పించాలని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఎన్నికల సామగ్రి పంపిణీ, రవాణా, భద్రతా ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

శాంతిభద్రతలపై ప్రత్యేక నిఘా

ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో అనకాపల్లి, నర్సీపట్నం, అడ్డురోడ్డు ఆర్డీఓలు, జిల్లా పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి, పోలీస్ అధికారులు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Nagi Reddy Shivaji– ప్రజా ముద్ర ప్రతినిధి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: