Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆజాద్‌కు అనకాపల్లి జిల్లా పోలీసుల ఘన నివాళి

Author
Posted By PRAJAMUDRA
| 11 Nov 2026, 01:28 PM | ఆంధ్రప్రదేశ్
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆజాద్‌కు అనకాపల్లి జిల్లా పోలీసుల ఘన నివాళి

  • ఆజాద్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

అనకాపల్లి, నవంబర్ 11: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న పురస్కార గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, విద్యావేత్తగా, రచయితగా దేశానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు, దేశంలో ఐక్యత, మత సామరస్యం, జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు.

స్వాతంత్ర్యం అనంతరం దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆజాద్, భారత విద్యారంగ అభివృద్ధికి పునాది వేశారని ఎస్పీ తెలిపారు. ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాల అభివృద్ధి, సాంకేతిక విద్య విస్తరణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

ఇవి కూడా చదవండి

విద్యకు ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 1992లో భారత ప్రభుత్వం ఆయనకు మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసిందని తెలిపారు. ఆజాద్ ఆశయాలు, దేశభక్తి, విద్య పట్ల ఆయనకున్న నిబద్ధత యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు, డీఎస్పీలు వి. బాబ్జిరావు, డి. శ్రీహరిరాజు, సీఐలు బాలసూర్యరావు, లక్ష్మి, సతీష్, సురేష్, రమణయ్య, ఎస్సైలు ప్రసాద్, సురేష్‌బాబు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: