Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

తాళ్లపాలెంలో ఎన్నికల నియమావళిపై పోలీసుల అవగాహన

Author
Posted By PRAJAMUDRA
| 11 Nov 2026, 10:46 PM | Array
తాళ్లపాలెంలో ఎన్నికల నియమావళిపై పోలీసుల అవగాహన

  • నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక -సీఐ స్వామి నాయుడు

కసింకోట, నవంబర్ 11 (ప్రజా ముద్ర): రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించేందుకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కసింకోట మండలం తాళ్లపాలెం గ్రామంలో పోలీసులు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా (ఐపీఎస్), అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు ఆదేశాల మేరకు కసింకోట సీఐ స్వామి నాయుడు, ఎస్సై లక్ష్మణ్ రావు గ్రామాన్ని సందర్శించి స్థానికులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలను గ్రామస్తులకు వివరించారు. ముఖ్యంగా యువత ఎన్నికల సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకూడదని సూచించారు.

ఇవి కూడా చదవండి

ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని సీఐ స్వామి నాయుడు కోరారు. ఎన్నికల పేరుతో గొడవలకు దిగడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: