Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు పరవాడ క్రీడాకారుడు పైల దుష్యంత్ ఎంపిక

Author
Posted By PRAJAMUDRA
| 15 Nov 2026, 08:25 AM | ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు పరవాడ క్రీడాకారుడు పైల దుష్యంత్ ఎంపిక

  • అండర్-14 ఎపీ విభాగంలో విశాఖ జిల్లా తరఫున ప్రాతినిధ్యం

పరవాడ, నవంబర్ 14: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు పరవాడకు చెందిన యువ క్రీడాకారుడు పైల దుష్యంత్ ఎంపికయ్యాడు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటుకుని రాష్ట్ర స్థాయి బరిలో నిలిచాడు.

నవంబర్ 14న అనకాపల్లి మండలం మామిడిపాలెంలోని పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన విశాఖపట్నం జిల్లా స్థాయి ఫెన్సింగ్ ఎంపిక పోటీల్లో దుష్యంత్ ప్రతిభ కనబరిచాడు. దీంతో అండర్-14 బాలుర ఎపీ (Epee) విభాగంలో జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు.

రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు పరవాడ క్రీడాకారుడు పైల దుష్యంత్ ఎంపిక - Additional Image

ఈ నెల 21, 22 తేదీల్లో కృష్ణా జిల్లా గన్నవరంలో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో దుష్యంత్ విశాఖపట్నం జిల్లా జట్టు తరఫున పాల్గొననున్నాడు.

దుష్యంత్ ఎంపికపై ఐకాన్ స్పోర్ట్స్ హబ్ నిర్వాహకులు, కోచ్‌లు సంతోషం వ్యక్తం చేశారు. ఫెన్సింగ్ కోచ్ మొల్లి తులసీరావు మాట్లాడుతూ, శిక్షణ సమయంలో దుష్యంత్ క్రమశిక్షణ, ఏకాగ్రతతో పాటు పట్టుదలను ప్రదర్శిస్తున్నాడని తెలిపారు. నిరంతర సాధనతో జిల్లా స్థాయిలో ప్రతిభ నిరూపించుకుని రాష్ట్ర స్థాయికి చేరడం అభినందనీయమన్నారు.

ఇవి కూడా చదవండి

గన్నవరంలో జరిగే పోటీల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసి పతకం సాధించడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందాలని ఆకాంక్షించారు.

స్థానిక యువ క్రీడాకారులకు దుష్యంత్ విజయం ప్రేరణగా నిలుస్తుందని ఐకాన్ స్పోర్ట్స్ హబ్ నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించి పరవాడ ప్రాంతానికి, విశాఖ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ దుష్యంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

– ప్రజా ముద్ర NEWS

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: