Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

ఎన్నికల వేళ గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు

Author
Posted By PRAJAMUDRA
| 19 Nov 2026, 11:06 PM | ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు

  • రేబాక, శంకరం గ్రామాల్లో అనకాపల్లి రూరల్ పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమం

అనకాపల్లి, నవంబర్ 19: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అనకాపల్లి రూరల్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అనకాపల్లి మండలంలోని రేబాక, శంకరం గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పించారు.

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్న 144 సెక్షన్ (ప్రస్తుత చట్ట ప్రకారం 163 బీఎన్ఎస్ఎస్), 30 పోలీస్ యాక్ట్, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో యువత, గ్రామస్తులు సంయమనం పాటించాలని, రాజకీయ విభేదాలతో గొడవలకు దిగడం, వర్గాలుగా విడిపోయి అశాంతి సృష్టించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో జరిగే ఘర్షణలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారని, అవసరమైతే రౌడీషీట్లు తెరవడం, బైండోవర్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఎదురైతే వెంటనే ఎన్నికల అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు వార్తలు, నిరాధార ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ఎన్నికల సమయంలో కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు అవసరమైన క్యారెక్టర్ సర్టిఫికెట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని యువతకు వివరించారు.

ఇప్పటికే గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పలువురిపై బైండోవర్ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి గొడవలు, అల్లర్లకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలతో పాటు బైండోవర్ బాండ్ ప్రకారం ఆర్థిక జరిమానా విధించే అవకాశం ఉంటుందని వివరించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ప్రజలు నేరుగా ఇళ్లకు వెళ్లాలని, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా గుమిగూడరాదని సూచించారు. ఎన్నికల ఫలితాల అనంతరం అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, వీధుల్లో గుంపులుగా తిరగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

ఈ కార్యక్రమంలో అనకాపల్లి రూరల్ సీఐ జి. అశోక్ కుమార్, ఎస్ఐ జి. రవి కుమార్, హెచ్‌సీ ఎస్. శంకర్, కానిస్టేబుల్ వెంకటేష్ పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: