Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

ష్రేష్ఠ (NETS) ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

Author
Posted By PRAJAMUDRA
| 23 Nov 2026, 12:41 PM | ఆంధ్రప్రదేశ్
ష్రేష్ఠ (NETS) ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తులకు నవంబర్ 30 చివరి తేదీ.. జనవరి 10న ప్రవేశ పరీక్ష

అనకాపల్లి: 2027–28 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ష్రేష్ఠ (SHRESHTA) పథకం ద్వారా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ పథకం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) SHRESHTA (NETS) ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

దరఖాస్తులకు నవంబర్ 30, 2026 చివరి తేదీగా నిర్ణయించగా, ప్రవేశ పరీక్షను 2027 జనవరి 10న నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

అనకాపల్లి జిల్లాలోని అర్హులైన పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారులు సూచించారు. అర్హత కలిగిన విద్యార్థులు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ముఖ్య సమాచారం:

- విద్యా సంవత్సరం: 2027–28
- పథకం: SHRESHTA (NETS)
- దరఖాస్తులకు చివరి తేదీ: 30-11-2026
- ప్రవేశ పరీక్ష తేదీ: 10-01-2027
- నిర్వహణ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)

— ప్రజాముద్ర NEWS

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: