Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

ఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవ వేడుకలు

Author
Posted By PRAJAMUDRA
| 11 Nov 2026, 03:46 PM | ఆంధ్రప్రదేశ్
ఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవ వేడుకలు

  • ఖాతాదారుల విశ్వాసం, సహకారమే బ్యాంకు అభివృద్ధికి ప్రధాన బలం: చీఫ్ మేనేజర్ సూర్యకుమారి

అనకాపల్లి (ప్రజాముద్ర ప్రతినిధి:) యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవ వేడుకలను స్థానిక మెయిన్ రోడ్డులోని బ్యాంకు శాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు, వ్యాపార ప్రముఖులు పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ మేనేజర్ సూర్యకుమారి మాట్లాడుతూ.. బ్యాంకు అభివృద్ధిలో ఖాతాదారుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఖాతాదారులు చూపిస్తున్న విశ్వాసం, అందిస్తున్న సహకారం, ఉద్యోగుల సమిష్టి కృషి ఫలితంగానే బ్యాంకు నిరంతర ప్రగతి సాధిస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకు సిబ్బంది కృషి చేస్తారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారి వంకాయల ఈశ్వరరావుతో పాటు బ్యాంకు ఉద్యోగులు రవికుమార్, ఈశ్వరరావు, ఏవీజీ రాజు, కాండ్రేగుల హరికృష్ణ, జి. శిరీష, శరగడం భవాని, ఆడారి రాము, మాలతి, అప్రైజర్ కృష్ణ, మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఖాతాదారులు, ఉద్యోగుల మధ్య ఆత్మీయ వాతావరణంలో వార్షికోత్సవ వేడుకలు సందడిగా సాగాయి.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: