Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

గంజాయి అక్రమ రవాణాదారుడిపై PIT NDPS చట్టం ప్రయోగం

Author
Posted By PRAJAMUDRA
| 11 Nov 2026, 03:55 PM | ఆంధ్రప్రదేశ్
గంజాయి అక్రమ రవాణాదారుడిపై PIT NDPS చట్టం ప్రయోగం

  • పాత కేసుల నేపథ్యంలో నిందితుడిపై నిర్బంధ ఉత్తర్వులు.. విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపు

అనకాపల్లి, నవంబర్ 11: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PIT NDPS చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టగా, పాయకరావుపేట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శివపురానికి చెందిన గొర్లి నానాజీ అలియాస్ నాయుడు (27) గతంలో పలు గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గతంలో కేసులు నమోదైనప్పటికీ గంజాయి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

రెండు భారీ గంజాయి కేసుల్లో నిందితుడు

2018 జూలై 4న నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెల్లిమెట్ట వద్ద వ్యాన్‌లో పనసకాయల మాటున తరలిస్తున్న 560 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నానాజీని మూడో నిందితుడిగా అరెస్టు చేశారు. ప్రస్తుతం కేసు విశాఖపట్నం మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణలో ఉంది.

అలాగే 2025 ఫిబ్రవరి 21న పాయకరావుపేట మండలం పెద్దిపాలెం గ్రామ సమీపంలోని సూదికొండ వద్ద విక్రయించేందుకు దాచిన 600 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులోనూ నానాజీ మూడో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

ఇవి కూడా చదవండి

PIT NDPS చట్టం కింద నిర్బంధం

నిందితుడి గత నేర చరిత్ర, గంజాయి అక్రమ కార్యకలాపాల్లో కొనసాగుతున్నట్లు వచ్చిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిపై పరిశీలన జరిపిన ప్రభుత్వం PIT NDPS చట్టం 1988లోని సెక్షన్ 3(1) ప్రకారం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పాయకరావుపేట సీఐ వినోద్ బాబు, ఎన్డీపీఎస్ సెల్ సురేష్ పర్యవేక్షణలో ఎస్ఐ పురుషోత్తం, పోలీసు సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.

గంజాయి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు

జిల్లాలో గంజాయి సాగు, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత భవిష్యత్తును, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: