Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

అర్హులైన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్‌తో ఆర్థిక భరోసా

Author
Posted By PRAJAMUDRA
| 11 Nov 2026, 03:30 PM | ఆంధ్రప్రదేశ్
అర్హులైన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్‌తో ఆర్థిక భరోసా

  • వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం – పీలా గోవింద సత్యనారాయణ

అనకాపల్లి, నవంబర్ 11: అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ వైద్య చికిత్స కోసం అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) అండగా నిలుస్తోందని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పీలా గోవింద సత్యనారాయణ అన్నారు.

అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబుతో కలిసి ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హతలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.

ఇవి కూడా చదవండి

వైద్య ఖర్చుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అవసరమైన పత్రాలతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకుని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే ప్రభుత్వ సంకల్పమని అన్నారు.

ఈ కార్యక్రమంలో 112వ వార్డు టీడీపీ ఇంచార్జి పోలారపు త్రినాథ్, కశింకోట మండల క్లస్టర్ ఇంచార్జి-3 కాండ్రేగుల సతీష్, కో-క్లస్టర్ ఇంచార్జి కొణతాల గణేష్, ఎంపీటీసీ తలారి ధనలక్ష్మి కాశీ, గౌరీ పీఏసీఎస్ డైరెక్టర్ కాండ్రేగుల నూకేశ్వరరావు (చిన్న), బోండా ప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: