Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

నవంబర్ 12న గ్రామీణ తపాలా ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

Author
Posted By PRAJAMUDRA
| 11 Nov 2026, 08:29 PM | ఆంధ్రప్రదేశ్
నవంబర్ 12న గ్రామీణ తపాలా ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

  • GDS ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.. 10 ప్రధాన డిమాండ్లతో ఆందోళన
  • అనకాపల్లి డివిజన్ ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొనాలి – డి.ఎస్.ఆర్. ప్రసాద్ పిలుపు

అనకాపల్లి, నవంబర్ 11: గ్రామీణ తపాలా ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 12న దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె నిర్వహించనున్నట్లు అఖిల భారత గ్రామీణ డాక్ సేవక్స్ సంఘం (AIGDSU) ప్రకటించింది. జాతీయ సంఘం పిలుపు మేరకు ఈ సమ్మె చేపడుతున్నట్లు అనకాపల్లి డివిజన్ AIGDSU కార్యదర్శి, విశాఖపట్నం రీజియన్ ప్రతినిధి డి.ఎస్.ఆర్. ప్రసాద్ తెలిపారు.

ఈ సందర్భంగా అనకాపల్లి డివిజన్‌తో పాటు నర్సీపట్నం బ్రాంచ్ పరిధి, అరకు, పాడేరు, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం సబ్ డివిజన్లలో పనిచేస్తున్న BPMలు, ABPMలు, ఇతర గ్రామీణ తపాలా ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొని తమ హక్కుల సాధనకు సంఘటితంగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇవే ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు

గ్రామీణ తపాలా ఉద్యోగుల కోసం ప్రత్యేక GDS జ్యుడీషియల్ పే కమిటీని ఏర్పాటు చేయాలని, 8వ కేంద్ర వేతన సంఘం ప్రయోజనాలను GDS ఉద్యోగులకు వర్తింపజేయాలని సంఘం డిమాండ్ చేస్తోంది. అలాగే గ్రామీణ తపాలా ఉద్యోగులకు సివిల్ సర్వెంట్ హోదా కల్పించడంతో పాటు పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, వైద్య సదుపాయాలు అందించాలని కోరుతోంది.

ఉద్యోగులపై విధిస్తున్న అసాధ్యమైన టార్గెట్లు, అధిక పని ఒత్తిడి, మానసిక వేధింపులను నిలిపివేయాలని, ABPM పోస్టుల భద్రతకు ముప్పు కలిగించే బీట్ మెకనైజేషన్, రీఆర్గనైజేషన్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

ఇక శాఖాపరమైన పనుల కోసం ఉద్యోగులు తమ సొంత మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా వినియోగించాలనే విధానానికి స్వస్తి పలికి, అవసరమైన సౌకర్యాలను తపాలా శాఖే కల్పించాలని కోరింది.

ఇవి కూడా చదవండి

2023 సమ్మెకు సంబంధించి ఉద్యోగులపై విధించిన క్రమశిక్షణ చర్యలు, చార్జిషీట్లు, శిక్షలను ఉపసంహరించుకోవాలని, AIGDSU సంఘానికి పూర్తి స్థాయి ట్రేడ్ యూనియన్ సౌకర్యాలు కల్పించి సభ్యత్వ ధృవీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్లలో పేర్కొంది.

అదేవిధంగా TRCA వేతనాల సవరణ, డీఏ, ప్రత్యామ్నాయ ఉద్యోగుల వేతనాలు, SDBS, బీమా, పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సంఘం కోరుతోంది.

మూడేళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక సూచన

మూడు సంవత్సరాల లోపు సర్వీసు కలిగిన GDS ఉద్యోగులు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా, సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు నైతిక మద్దతు అందించాలని డి.ఎస్.ఆర్. ప్రసాద్ సూచించారు.

గ్రామీణ తపాలా ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అనకాపల్లి డివిజన్ పరిధిలోని అన్ని సబ్ డివిజన్ల ఉద్యోగులు సమ్మె విజయవంతానికి సహకరించాలని కోరారు.

– ప్రజాముద్ర న్యూస్

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: