Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

నెల రోజుల చిన్నారికి ప్రపంచ రికార్డు గుర్తింపు

Author
Posted By PRAJAMUDRA
| 14 Nov 2026, 05:14 PM | ఆంధ్రప్రదేశ్
నెల రోజుల చిన్నారికి ప్రపంచ రికార్డు గుర్తింపు

  • పుట్టుకతోనే 6 నుంచి 7 సెంటీమీటర్ల పొడవైన ఒత్తైన జుట్టు.. ఉమ్మలాడ గ్రామానికి గర్వకారణంగా యాసిక శ్రీ

అనకాపల్లి: సాధారణంగా చిన్నారులు పుట్టినప్పుడు తక్కువ జుట్టుతో కనిపిస్తారు. అయితే అనకాపల్లి జిల్లాకు చెందిన నెల రోజుల పసికందు పుట్టుకతోనే పొడవైన, ఒత్తైన జుట్టుతో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా తన ప్రత్యేకతతో ప్రపంచ రికార్డు గుర్తింపును సైతం అందుకుని వార్తల్లో నిలిచింది.

అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామానికి చెందిన యాసిక శ్రీ అనే చిన్నారి ఈ అరుదైన గుర్తింపును సాధించింది. సెప్టెంబర్ నెలలో అనకాపల్లి పట్టణంలోని ఘోషా ఆసుపత్రిలో జన్మించిన ఈ పాపకు పుట్టుకతోనే సుమారు 6 నుంచి 7 సెంటీమీటర్ల పొడవైన ఒత్తైన జుట్టు ఉండటం విశేషం.

చిన్నారి ప్రత్యేకతను గుర్తించిన తల్లిదండ్రులు ప్రపంచ రికార్డుల సంస్థను సంప్రదించారు. అనంతరం సంబంధిత ప్రతినిధులు పాపకు సంబంధించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు, జుట్టు పొడవును పరిశీలించి 'వన్ మంత్ బేబీ' విభాగంలో రికార్డు నమోదును ధ్రువీకరించారు. ఈ మేరకు చిన్నారికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ఇవి కూడా చదవండి

తమ ఇంట పుట్టిన ఆడబిడ్డ నెల రోజుల వయసులోనే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి ఈ గుర్తింపు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆడపిల్ల పుట్టడాన్ని భారంగా భావించే ఆలోచనలకు భిన్నంగా, తమ కుమార్తె పుట్టుకతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

భవిష్యత్తులో యాసిక శ్రీ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. ఈ చిన్నారి అరుదైన ప్రత్యేకత ఉమ్మలాడ గ్రామంతో పాటు అనకాపల్లి జిల్లాలో ఆసక్తికర చర్చకు దారితీసింది.

ప్రజా ముద్ర NEWS | అనకాపల్లి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: