Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు భారీ ప్రోత్సాహకాలు.. గరిష్ఠంగా రూ.50 లక్షలు!

Author
Posted By PRAJAMUDRA
| 14 Nov 2026, 10:43 PM | ఆంధ్రప్రదేశ్
ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు భారీ ప్రోత్సాహకాలు.. గరిష్ఠంగా రూ.50 లక్షలు!

అనకాపల్లి, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లో 2026 గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందించనుంది.

ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీఓ ఆర్‌టీ నంబర్ 1111, తేదీ 13-11-2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటించింది.

జనాభా ఆధారంగా ప్రోత్సాహకాలు ఇలా..

- 5,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షలు.
- 5,001 నుంచి 10,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు.
- 10,000కు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షలు.

అయితే ఈ ప్రోత్సాహకం పొందాలంటే కేవలం సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కావడం సరిపోదు. గ్రామ పంచాయతీలోని సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సంబంధిత ఎన్నికల అధికారులు ఏకగ్రీవ ఎన్నికలను అధికారికంగా ప్రకటించి, అర్హతను నిర్ధారించిన తర్వాత నిధుల విడుదల చేపడతారు. ఈ నిధులను గ్రామాల్లో ఆమోదం పొందిన అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే వినియోగించాల్సి ఉంటుంది.

నిధులను విడతలవారీగా విడుదల చేయనుండగా, ఈ ప్రోత్సాహక పథకం 2026 సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రజాస్వామ్య హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

ప్రజా ముద్ర NEWS

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: