Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

ప్రేమ, పెళ్లి పేరుతో యువతికి మోసం.. నిందితుడికి ఏడాది జైలు

Author
Posted By PRAJAMUDRA
| 20 Nov 2026, 05:13 PM | Crime, ఆంధ్రప్రదేశ్
ప్రేమ, పెళ్లి పేరుతో యువతికి మోసం.. నిందితుడికి ఏడాది జైలు

  • రూ.20 వేల జరిమానా విధించిన విశాఖ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం
  • విచారణాధికారిగా ప్రస్తుత అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

అనకాపల్లి, నవంబర్ 20: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని నమ్మించి మోసగించిన కేసులో నిందితుడికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన ఈ కేసులో విశాఖపట్నంలోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం (XI అదనపు జిల్లా జడ్జి కోర్టు) ఈ తీర్పు వెలువరించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్.రాయవరం మండలం భీమవరం గ్రామానికి చెందిన గనిశెట్టి త్రినాథ్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. యలమంచిలి మండలంలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్న సమయంలో ఆమెకు పరిచయమై, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటానని నమ్మించాడు. అయితే వివాహం చేసుకోవాలని యువతి కోరినప్పుడు కులం పేరుతో నిరాకరించి మోసగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు 2020 జూన్ 16న ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 479/2020 కింద ఐపీసీ సెక్షన్లు 417, 376తో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

ప్రస్తుత ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు

ఈ కేసు నమోదైన సమయంలో నర్సీపట్నం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహించిన ప్రస్తుత అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. నిందితుడిని 2020 జూన్ 22న అరెస్టు చేసి, కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి

విచారణలో సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడు గనిశెట్టి త్రినాథ్‌ను ఐపీసీ సెక్షన్ 417 కింద దోషిగా నిర్ధారించింది. సీఆర్‌పీసీ సెక్షన్ 235(2) ప్రకారం ఏడాది జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.

పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. మీనాతో పాటు, సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరిచిన ఎస్.రాయవరం పోలీసు సిబ్బంది, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (CMS) సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.

మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయం వెల్లడించింది.

ప్రజాముద్ర NEWS | అనకాపల్లి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: