Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

నూకాంబిక ఆలయ భూమి కొనుగోలులో తొమ్మిదేళ్ల జాప్యం!

Author
Posted By PRAJAMUDRA
| 21 Nov 2026, 10:21 AM | ఆంధ్రప్రదేశ్
నూకాంబిక ఆలయ భూమి కొనుగోలులో తొమ్మిదేళ్ల జాప్యం!

  • అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరపాలి.. డాక్టర్ బి.ఎం. నాయుడు విజ్ఞప్తి

అనకాపల్లి: అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానానికి సమీపంలోని తన కుటుంబ వారసత్వ భూమి కొనుగోలు ప్రక్రియ తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో ఉందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ డాక్టర్ బి.ఎం. నాయుడు దేవాదాయ శాఖ అధికారులను కోరారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించినట్లు ఆయన వెల్లడించారు.

డాక్టర్ బి.ఎం. నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి ఓల్డ్ ఫోర్ట్ వార్డు పరిధిలోని నూకాంబిక ఆలయం సమీపంలో సర్వే నంబర్ 559/7లో తమ కుటుంబానికి వారసత్వంగా 48 సెంట్ల భూమి ఉందని తెలిపారు. ఇందులో 40 సెంట్ల భూమిని దేవస్థానం ఇప్పటికే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుందని పేర్కొన్నారు.

మిగిలిన 8 సెంట్ల భూమిని కూడా ఆలయ అభివృద్ధి అవసరాల కోసం విక్రయించేందుకు 2017 ఫిబ్రవరి 9న అధికారికంగా అంగీకార పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ భూమి కొనుగోలుకు విజయవాడలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రక్రియ ముందుకు సాగలేదని ఆయన ఆరోపించారు.

భూ రికార్డుల మార్పులపై అనుమానాలు

సర్వే నంబర్ 559/7కు సంబంధించి ఆన్‌లైన్ మీ భూమి రికార్డుల్లో కొండ్రేగుల అప్పన్న అనే వ్యక్తి పేరు నమోదై ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పేరు ఏ ప్రాతిపదికన నమోదు చేశారు? మ్యుటేషన్‌కు ఎవరు ఆమోదం తెలిపారు? భూ రికార్డుల్లో మార్పులకు బాధ్యులెవరు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

అలాగే దేవస్థానం కొనుగోలు చేసిన ఇతర భూములకు సంబంధించిన ఎఫ్‌ఎంబీ (FMB) స్కెచ్‌లు జత చేయకపోవడం వల్ల తమ స్థలానికి సంబంధించిన వివరాలను గుర్తించడం కష్టంగా మారిందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

న్యాయం చేయాలని విజ్ఞప్తి

వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, భూమి వ్యవహారం పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని డాక్టర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీఐ దరఖాస్తులు, నోటీసులు ఇచ్చినప్పటికీ సమగ్ర సమాధానాలు లభించలేదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తొమ్మిదేళ్ల జాప్యానికి గల కారణాలను వెల్లడించాలని, కొనుగోలు ప్రక్రియను నిలిపివేయడానికి బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భూ రికార్డుల మార్పులపై విచారణ జరిపి తమ కుటుంబానికి చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

తక్షణమే సమస్యను పరిష్కరించకపోతే తమ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

– ప్రజా ముద్ర NEWS

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: