Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
Advertisement
మెనూ (MENU)

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో మార్పులు

Author
Posted By PRAJAMUDRA
| 29 Oct 2026, 03:45 PM | ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో మార్పులు

  • అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల సమరం: బరిలో 80 మంది జడ్పీటీసీ, 979 మంది ఎంపీటీసీ అభ్యర్థులు
  • పోలింగ్ నవంబర్ 5న, కౌంటింగ్ 7న
  • రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
  • వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

ప్రజాముద్ర, అనకాపల్లి:
అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో మార్పులు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5వ తేదీన ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం నవంబర్ 7వ తేదీన ఉదయం 8:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు.
ఎన్నికల బరిలో అభ్యర్థుల వివరాలు:
జిల్లాలోని మొత్తం 24 జడ్పీటీసీ స్థానాలకు 80 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 427 ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 425 స్థానాలకు 979 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు.
రెండు స్థానాలు ఏకగ్రీవం:
ఎస్.రాయవరం మండలంలోని పెద్ద గుమ్మలూరు ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏజర్ల అనిల్ వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం-1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి లాలం నాగలక్ష్మి ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: